Rebel / రెబెల్

Editor · Novels

Rebel / రెబెల్ book cover

Price: Rs. 135. కొండ కింది నుంచి చూస్తే, ఇళ్లు పువ్వుల్లా కనిపిస్తాయి. ఊరు ఒక పుష్పగుచ్ఛంలా కనిపిస్తుంది. పుష్పగుచ్ఛంలో ఆకుల్లా, రెమ్మల్లా ఇళ్ల చుట్టూ మర్రిమాన్లు, సుంకేసుల, దేవగన్నెరు చెట్లు, రేగు, బలుసు పొదలు. ఆ ఊళ్లో వాళ్ల మాటలు కూడా తమాషాగా ఉంటాయి. ఏదయినా చాల బాగుందని చెప్పాలంటే 'బద్రంగ' ఉందంటారు. చస్తావురోయ్ అనాలనుకుంటే 'గుంతనారకు వోతావు రో' అంటారు. వేరే ఊళ్ల గురించి మాట్లాడాలనుకుంటే 'దిగోన' అంటారు. (దిగోన: దిగువన: కొండకు దిగువన). ఇన్ని మాటలెందుకు, ఆ ఊరిది ఒక ప్రత్యేక భాష.

Browse more Telugu books