Rastralu-Alpa Sankyaka Vargalu (Dr.Babasaheb Ambendkar: Rachanalu, Upanasyalu) Series2
Editor · Politics

Price: Rs. 100. రాష్ట్రాలు మైనారిటీలు: వారి హక్కు లేమిటి? స్వతంత్ర భారత రాజ్యాంగంలో వాటి పరిరక్షణ ఎలా? అనే డాక్యుమెంటును బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించడానికి తయారు చేసిన పత్రం. ఈ పత్రం భావి భారత రాజ్యాంగంలో సిద్ధం చేశారు. ఈ నివేదికను షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థనతో భారత రాజ్యాంగ పరిషత్కు సమర్పించడానికి సిద్ధం చేశారు. ఇందులో మూడు అధ్యాయాలున్నాయి. -రాజ్యాంగ పీఠిక ప్రతిపాదన -వివిధ రాష్ట్రాలను భారతదేశంలో చేర్చుకోవడానికి సంబంధించిన రాజ్యాంగం మొదటి అధికరణ ప్రతిపాదన. -భారత పౌరుల ప్రాథమిక హక్కులకు సంబంధించిన రెండో అధిఃకరణ ప్రతిపాదన, అల్ప సంఖ్యాక వర్గాలు, షెడ్యూల్డు కులాల సంరక్షణకు సంబంధించిన నియమాల ప్రతిపాదన. -ఇవి కాకుండా మరో నాలుగు అనుబంధాలున్నాయి. బాబాసాహెబ్ అంబేడ్కర్ తయారు చేసిన నివేదిక రాజ్యాంగం లాగా వుంది. ఇంతటి సామర్థ్యం ఉన్నవారు, రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన వారిలో మరొకరు లేరంటే అతిశయోక్తికాదు. 289 మంది సభ్యులలో కేవలం అంబేడ్కర్ ఒక్కడే కాంగ్రేసేతర సభ్యుడు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలను ముస్లిం లీగ్ బహిష్కరించింది. డా॥ అంబేడ్కర్ గాంధీకి ప్రాణభిక్ష పెట్టడానికి పూనా ఒప్పందాన్ని అంగీకరించినప్పుడు చేసుకున్న ఒప్పందం సమయంలో షెడ్యూల్డు కులాల వారి ఎన్నికలలో కలిగించుకోబోమని వాగ్దానం చేసిన మనువాద నాయకులు మాట మీద నిలబడకుండా ప్రవర్తించారు. ఎన్నికలలో కల్పించుకుని షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ సభ్యులను నెగ్గకుండా చేశారు. అంబేడ్కర్ను ఓడించడానికి అనైతికంగా ప్రవర్తించారు. అంబేడ్కర్ తన మేథో సంపత్తితో ఒంటరిగానే కరుడుగట్టిన మనువాదులను ఎదుర్కొన్నాడు. భారతీయ ప్రజల పక్షాన నిలబడి అట్టడుగు ప్రజల మేలు కొరకు పోరాడుతూ, జోగేంద్ర నాథ్ మండల్ సహకారంతో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కావడం, అంబేడ్కర్ గెలిచిన ప్రాంతాన్ని మెజారిటీ ప్రజలు హిందువు లున్నప్పటికీ పాకిస్తాన్కు కానుకగా ఆ ప్రాంతంతో పాటు అంబేడ్కర్ న్ను వదిలించు కోవాలనుకున్న విషయాలన్ని తన సుధీర్గమైన ముందుమాట రాసిన పిల్లి రాంబాబు చాలా వివరంగా చరిత్రలో