Rassian Social Democratla Karthavyalu

Editor · Politics

Rassian Social Democratla Karthavyalu book cover

Price: Rs. 15. సోషల్ డెమోక్రాట్లు ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత నిస్తున్నారని, ప్రజాస్వామిక పోరాటాలను విస్మరిస్తున్నారని లేదా నిర్లక్ష్యం చేస్తున్నారని లేవనెత్తిన విమర్శలకు, అభిప్రాయాలకు సమాధానంగా లెనిన్ ఈ వ్యాసాన్ని రచించారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాల్సిన సోషలిష్టు కార్యకలాపాలను మరెవ్వరూ నిర్వహించరని, ఈ పనిని సోషల్ డెమోక్రాట్లు (కమ్యూనిస్టులు) మాత్రమే నిర్వహించగలరని, ఈ పనికి ప్రజాస్వామిక కార్యకలాపాలను కూడా జోడించి ఏక కాలంలో పని చేయాలని, ప్రజాస్వామిక కార్యకలాపాల్లో ఇతర వర్గాలు కూడా కలిసివచ్చే అవకాశమున్నందున వారిని కలుపుకుని కృషి చెయ్యాలని, అయితే కలుపుకోవడం పేరుతో వారి అభిప్రాయాలతో రాజీ పడటం, తమ స్వతంత్రతకు భంగం కలిగించుకోవడం సోషల్ డెమోక్రాట్లు చేయకూడదని లెనిన్ ఈ వ్యాసంలో వివరించారు. మన దేశంలో వర్గ ఉద్యమంలో భాగంగా ఆర్ధిక పోరాటాలను, సామాజిక ఉద్యమాలను అనుసంధానం చేసి నడపాల్సిన ప్రస్తుత తరుణంలో మన మార్క్సిస్టు అవగాహనను పెంచడానికి, మనలో అక్కడక్కడా కనిపిస్తున్న గందరగోళాన్ని తొలగించడానికి లెనిన్ వ్యాసం తోడ్పడుతుంది.

Browse more Telugu books