Ranaday, Gandhi, Jinna (Dr.Babasaheb Ambendkar: Rachanalu, Upanasyalu) Series3

Editor · History

Ranaday, Gandhi, Jinna (Dr.Babasaheb Ambendkar: Rachanalu, Upanasyalu) Series3 book cover

Price: Rs. 65. భారతదేశ రాజకీయ, సాంఘిక రంగాల్లో ముందు వరుసలో నిలువదగిన చింతనా పరుల్లో జస్టిస్ మహదేవ్ గోవింద రానడే ఒకరు. ఆయన 101వ పుట్టిన రోజు సందర్భంగా డా॥ బి. ఆర్. అంబేడ్కర్ “పూనా" పట్టణంలో ఈ ఉపన్యాసం చేశారు. ఉపన్యాస ప్రారంభంలో “చరిత్ర నిర్మాణంలో మానవుని పాత్ర" అనే అంశాన్ని ఆయన చర్చించారు. చరిత్ర నిర్మాణ మనేది భౌగోళిక, భౌతిక అంశాల ఆధారంగా జరుగుతుందని చెప్పిన “బకెల్" సిద్ధాంతంకాని, ఆర్థిక శక్తుల ఆధారంగా నిర్మించబడుతుందని చెప్పిన “మార్క్స్” సిద్ధాంతంకానీ సగం వాస్తవాల్నే తెలుపుతున్నాయని డా॥ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఈ ఇరువురి సిద్ధాంతాల్లో “మనిషికి” మాత్రం చోటు యివ్వబడలేదు కానీ! చరిత్ర నిర్మాణంలో మానవునిదే ప్రముఖమైన పాత్ర అని డా॥ అంబేడ్కర్ గట్టిగా అభిప్రాయపడ్డారు. పర్యావరణ శక్తులు (భౌతిక -సాంఘిక) మాత్రమే చరిత్ర నిర్మాణం చేయలేవని డా॥ అంబేడ్కర్ భావించారు. నాయకత్వ ఆరాధనకు (Hero worship) పెద్ద పీట వేసే “కార్లీల్”, ఉన్నత మానవుని నిర్ధారణకు చేయవలసిన పరీక్షల విషయంలో, ఆయనతో పాటు తదితర రాజకీయ చింతనాపరుల అభిప్రాయాలను కూడా డా॥ అంబేడ్కర్ ఈ సందర్భంలో చర్చించారు. కూలంకుష చర్చల అనంతరం; ఒక మనిషి ఉన్నత మానవునిగా పరిగణించబడాలంటే, ఆ మనిషి నిజాయితీతో కూడిన మేధావి అయి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు గుణాలతో పాటు, నిరంతరం అభివృద్ధిచెందే సమాజ స్ఫూర్తితో కదలాలని, సమాజంలోని కుళ్ళును కడిగివేయటానికి ఒక సామాజిక పారిశుద్ధ్య పనివాడుగా మేధావి ఉండాలని డా॥ అంబేడ్కర్ భావించారు

Browse more Telugu books