Ramuni Krishnuni Rahasyalu

Dr. B. Vijayabharathi / బి. విజయభారతి · History

Ramuni Krishnuni Rahasyalu book cover

Price: Rs. 45. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప నాయకుడు, రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్త. తన సునిశిత పరిశీలనతో, నిరంతర అధ్యయనంతో ఎన్నో గ్రంథాలను రాశారు. ప్రధానంగా మనిషిని పశువుగా మార్చేస్తున్న కులతత్వాల, స్వార్ధ ప్రయోజనాలు, ఆధిపత్యం చలాయింపు కొరకు 'మానవత్వాన్ని' మంటగలుపుతున్న మతతత్వాల లొసుగులను ఖండిస్తూ విలువైన రచనలు చేశారు. అంబేడ్కర్ మరణానంతరం ఆయన సంపూర్ణ రచనలను ప్రచురించే బాధ్యతను మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా మూడు సంపూటాలు వెలువడ్డాయి. "రిడిల్స్ ఇన్ హిందూయిజం" నాలుగవ సంపుటం. అందరూ అనుకున్నట్టే ఈ పుస్తకం బయటకు రాగానే గొప్ప సంచలనం సృష్టిస్తూ పెద్ద వివాదాన్ని రేపింది. హిందూమతం పై విమర్శలున్నాయని, అసభ్యకరమైన రాతలున్నాయని, ఈ పుస్తకం లోని 'ది రిడిల్స్ ఆఫ్ రామా అండ్ కృష్ణా'లో తమ దేవుళ్లను కించపరిచే రాతలున్నాయని, దీన్ని సహించేది లేదని, వెంటనే ఆ పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలని, అందులోని కొన్ని భాగాలను తొలగించాలని, మరాఠా మహా సంఘం వారు, శివసేన వారూ పెద్ద ఆందోళన లేవదీశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం పుస్తకం అమ్మవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పుస్తకం కోసం ఎదురుచూస్తున్న మేధావులు, దళితులు, ప్రజాస్వామిక శక్తులు ఈ సంఘటనతో కలవరపడ్డాయి.

Browse more Telugu books