Ramudu, Krishnudu Marmalu, Shudrulaku Kavali Ambendkar, Matha Marpidi
Editor · History

Price: Rs. 120. నేను హిందువుగా జన్మించినప్పటికీ హిందువుగా మాత్రం మరణించనని 1935లో నాసిక్ లో జరిగిన ఒక సమావేశంలో విప్లవాత్మక ప్రకటన చేశాడు బాబా సాహెబ్ అంబేడ్కర్. పై అసాధారణ వాక్యాల వెనుక అంబేడ్కర్ అసమాన ప్రతిభతో చేసిన తాత్విక, తార్కిక పరిశీలన ఈ 'ఉపన్యాసంలో చదవచ్చు. హిందూ మతంలోని సామాజిక దురాచారాలు కొన్ని కులాలను అతి క్రూరంగా అణచివేసేందుకు కారణాలు, వ్యక్తి, సమాజము, వ్యవస్థ, హిందూ మతంలోని అసమానత్వం. మానవుడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, హిందూ మత మూలాలు, హిందూ మతాన్ని ఎందుకు మారాలి? మారితే సాధించేదే మిటి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి? అనే అంశాలను సూటిగా విశ్లేషణాత్మకంగా, సులభంగా వివరిస్తారు అంబేడ్కర్ ఈ ఉపన్యాసంలో. ఒక్క మాటలో చెప్పాలంటే మత మార్పిడిలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాలను భిన్న దృక్పథాలలో వివరిస్తూ మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు బాబా సాహెబ్ అంబేడ్కర్, ఈ చిన్న ఉపన్యాసంలో.....