Ramudu, Krishnudu...Adharsha Purushula? series 15

Editor · History

Ramudu, Krishnudu...Adharsha Purushula? series 15 book cover

Price: Rs. 45. ప్రజల్ని చైతన్యం చేయటానికి వాల్మీకి, వేదవ్యాసుల రచనల ఆధారంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ ఇంగ్లీష్ లో రాసిన Riddle of Rama & Krishna పుస్తకాన్ని తెలుగులో “రాముడు-కృష్ణుడు ఆదర్శపురుషులా?” అనే టైటిట్తో సమాంతర ద్వారా మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. అంబేడ్కర్ రచనలు-ఉపన్యాసాల ఆలోచన సంపుటాలను ముద్రించమని 1979లో ఎల్.ఆర్. బాలి, భగవాన్ దాస్ల నాయకత్వంలో సంస్థ 'సమతా సైనిక్ దళ్' చేసిన పోరాట ఫలితంగా బాబాసాహెబ్ రచనలు వెలుగులోకి వచ్చాయి. ట్రంకు పెట్టెల్లో చెదలుపడుతున్న దుస్థితిలో వున్న అంబేడ్కర్ రచనలను బయటికి తీసి ప్రచురించండి లేదా మాకు అప్పజెప్పండి మేమే ప్రచురించుకుంటాము అని హైకోర్టు తలుపు తట్టిన తరువాతనే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురణకు పూనుకుంది. ప్రముఖ అంబేడ్కర్ అనుయాయి వసంతమూన్ సంపాదకత్వంలో 1979 నుండి ప్రచురణ మొదలై 2014 వరకు 22 సంపుటాలు 27 పుస్తకాలుగా ఇంగ్లీష్ ముద్రించారు. ఆ తర్వాత ఢిల్లిలోని అంబేడ్కర్ ఫౌండేషన్ 17 సంపుటాలను ప్రచురించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుస్తకాలను అనువాదం కాని సుమారు 12 వేలకు పైగా పేజీలను ప్రచురిస్తామని చెప్పింది. కాని బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

Browse more Telugu books