Ramayanam

Editor · History

Ramayanam book cover

Price: Rs. 180. వాల్మీకి నోట వెలువడ్డ వాక్సుధ రామకథ. భారతీయ విలువల జీవన వాహిని. రాజధర్మానికీ పుత్రధర్మానికీ భ్రాతృధర్మానికీ పతిధర్మానికీ పత్నీధర్మానికీ... మొత్తంగా భారతీయ ధర్మానికి ఎత్తిన జయపతాక రామాయణం. రామాయణం ఒక వీర గాథ ఒక ప్రణయ గాథ ఒక స్నేహ గాథ ఒక త్యాగ గాథ మానవునిగా పుట్టిన వాడు మాధవునిగా ఎలా ఎదగలడో చెప్పే మానవ వికాస గాథ. భాషకో కులానికో మతానికో ప్రాంతానికో పరిమితం కాని విశ్వనరుని గాథ. ఈ కావ్యాన్ని ఎందరో కవులు వివిధ భాషలలో తమదిగా రాసుకున్నారు. ఎందరో జానపదులు తమదానిగా చేసుకొని పాడుకున్నారు. ఈ క్రమంలో వాల్మీకి చెప్పని ఎన్నో అంశాలు రామాయణంలో దూరిపోయాయి. పాత తరంలోని వారికి కథ ఏదో కల్పన ఏదో తెలుసుకునే తీరుబడి ఉండేది. ఈ తరానికి ఆ వెసులుబాటు లేదు. అందువల్ల ఈ తరం కోసం అసలైన ఆదికావ్యాన్ని మాత్రమే అనుసరిస్తూ అందరినీ చేరేలా సరళమైన తెలుగులో సరస సుందరంగా రామకథను చెప్పే ప్రయత్నం చేసాము. ఆ యత్నమే ఈ ఆధునిక కథనం. ఇది వాల్మీకి రామకథాసుధకు సమర్పిస్తున్న అక్షరాంజలి.

Browse more Telugu books