Ramayana Visheshamulu
Editor · History

Price: Rs. 250. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896-ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా బహు ముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి. స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలుగు, సంస్కృతం. పారసీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము వీరి ఇతర ముఖ్య రచనలు. నైజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగుభాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారు. జీవిత చివర దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుజాతికి ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను 'కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు' లభించింది.