Ramayana Vishavruksham

Ranganayakamma · New Arrivals

Ramayana Vishavruksham book cover

Price: Rs. 280. 'రామాయణ విషవృక్షం' ఇప్పటి వరకూ 3 భాగాలుగా (3 వేరు వేరు పుస్తకాలుగా) ఉంది. కానీ ఇప్పటి నించీ ఆ 3 భాగాలూ ఒకే సంపుటంగా (ఒకే పుస్తకంగా) కలిసిపోతున్నాయి. 'విషవృక్షం'లో మొదటి భాగాన్ని 1974లోనూ, 2వ భాగాన్ని 1975లోనూ, 3వ భాగాన్ని 1976లోనూ రాశాను. ఆ నాటి నించీ ఇప్పటి వరకూ మొదటి భాగం 7 ముద్రణలూ, 2వ భాగం 6 ముద్రణలూ, 3వ భాగం 4 ముద్రణలూ వచ్చాయి. ఇప్పుడు ఇది, అన్ని భాగాలూ కలిసిపోయిన సంపుటానికి మొదటి ముద్రణ. ఈ భాగాలు వేరు వేరుగా ఉన్నప్పుడు, వాటికి వేరు వేరు పీఠికలు రాశాను. అంతే కాదు, ఒక భాగానికి రీప్రింటు జరిగినప్పుడల్లా అందులో ఒకటో రెండో సవరణలు చేస్తూ, కొత్త ముందు మాటలు రాస్తూ వచ్చాను. ఇప్పుడు, అన్ని భాగాలూ, కలిసిపోయిన ఈ సంపుటం కోసం, కొన్ని మార్పులు చేశాను. వాటిని పాఠకులకు చెప్పాలి. 1. వాల్మీకి రామాయణానికి గతంలో చదివిన అనువాదాల్ని ఇప్పుడు మళ్ళీ చూశాను. ఎక్కడ ఏ సందేహం కలిగినా, అనువాదాల్నీ, వాటికి మూలం అయిన శ్లోకాల్నీ, మళ్ళీ మళ్ళీ చూసి స్పష్టం చేసుకున్నాను. కొన్ని సందర్భాల్లో, అనువాదకులు చేసిన పొరపాటు వ్యాఖ్యానాల్ని గతంలో నేను యధాతధంగా తీసుకున్నట్టు గమనించి అలాంటి పొరపాట్లు సవరించాను. 2. అనువాదాలతో సంబంధం లేకుండా నా పొరపాట్లు కూడా కొన్ని జరిగాయి. ఉదా: తాటకిని గురించి చెప్పిన చోట, తాటకి 'విల్లు' పట్టుకున్నట్టు గతంలో రాశాను. కానీ, వాల్మీకి మూలంలో, తాటకి, విల్లు ఉపయోగించదు. అలాగే, శూర్పణఖ, రాముడితో మాట్లాడుతూ, 'సీతా స్వయంవరానికి మా అన్న కూడా వెళ్ళాడు' అని చెప్పినట్టు గతంలో రాశాను. కానీ, వాల్మీకి మూలంలో అది లేదు. ఇలా, కొన్ని సందర్భాల్లో మూలాన్ని మళ్ళీ చూసి అలాంటి పొరపాట్లన్నీ తీసేశాను. 3. గతంలో, 'మందర' పాత్రని ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పాత్రని కూడా చేర్చాను. 4. 'పీఠిక'లో అక్కడక్కడా తగ్గింపులూ, అక్కడక్కడా హెచ్చింపులూ, రెండూ చేశాను. ముఖ్యంగా, శ్రమ దోపిడీలో 'అదనపు విలువ'ని వివరించే భాగాల్ని ఇప్పుడు తీసేశాను. ఎందుకంటే, ఇప్పుడు ఆ విషయాలు 'కాపిటల్ పరిచయం' ద్వారా తెలుసుకోవడానికి వీలుంది. గతంలో, ఈ పీఠిక ర

Browse more Telugu books