Ramachiluka / రామచిలుక

ఎల్ .ఆర్ స్వామి / L .R . SWAMY · Stories & Poetry

Ramachiluka / రామచిలుక book cover

Price: Rs. 95. L.R. Swamy పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళె: ప్రస్తుతం గోవా గవర్నర్గా వున్నారు. వారు రచించిన 150 వ పుస్తకం ఇది. ఈ సంపుటిలో ఏడు కథలు వున్నాయి. పల్లె తాలూకు నైర్మల్యమూ విలువల స్పృహ, మానవత్వం పట్ల నమ్మకం వగైరాల గురించి నొక్కి వక్కాణించే కథలు ఇవి. రాజకీయ జీవితమూ వృత్తి పరమైన బాధ్యతలూ సృష్టించిన సమయాభావాన్ని అధిగమంచి, సృజనాత్మక రచనలు చేస్తున్నారు ఈ రచయిత. కన్నీటితో నవ్వుతూ పోరాడే మిణుగురువుగా నైనా, వెలుగు వెదజల్లు అనే రచయిత జీవన తాత్వికతయే, ఈ కథల వజ్రశోభకి కారణం. ఇతివృత్తాల్లో వైవిధ్యం, కథనంలో సరళత ఈ కథల ప్రత్యేకత. ప్రాకృతిక సౌందర్యాన్ని, మానవనైజాన్ని ఆకట్టుకునే సన్నివేశాలతో దర్శింపజేయడం రచయిత శ్రీధర్ పిళ్ళె కథన కౌశలం. ఒక్కమాటలో చెప్పాలంటే పాఠక హృదయాల్ని చెమరింపజేసే ఆర్ద్రత ఈ కథల్లోని సుగుణం. ఎల్.ఆర్.స్వామి: ఈ కథలను మలయాళం నుంచి నేరుగా అనువాదం చేసిన స్వామి మలయాళీ, పుట్టింది పెరిగింది అంతా కేరళ లోనే. మలయాళం మాధ్యమం లోనే చదువుకున్నారు. ఉద్యోగ రీత్యా ముంబై నుంచి విశాఖ వచ్చి స్థిరపడ్డాక తెలుగు భాషా సాహిత్యాలు స్వయంగా చదివి నేర్చుకొని తెలుగులో 200 కథలు వ్రాసారు. అవార్డులు బహుమతులు పొందారు. ఒక శతాబ్దపు (1910-2010) తెలుగు కథారచయితుల వరుసలో చోటు సంపాదించుకున్నారు. మలయాళం నుంచి తెలుగులోకి 44 పుస్తకాలు, తెలుగునుంచి మలయాళంలోకి 22 పుస్తకాలు అనువాదం చేసారు. కేంద్ర సాహిత్య అకాడమి వారి అనువాద పురస్కారం అందుకున్నారు. అనువాద సాహిత్యంలో చేసిన కృషిని గుర్తించి గీతం యూనివర్సిటీ వారు 2022లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసారు.

Browse more Telugu books