Ramabai Ambendkar, Naku Telisina Baba Ambendkar

Editor · History

Ramabai Ambendkar, Naku Telisina Baba Ambendkar book cover

Price: Rs. 180. ఈ పుస్తకానికి ముందు 'పూజ్యమాత రమాబాయి అంబేడ్కర్' పేరిట 2001లో ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించాం. ఆ పుస్తకం అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ ప్రోత్సాహంతో విస్తృతపర్చి ఈ పుస్తకాన్ని రాశాను. డా॥ అంబేడ్కర్ ను 'బాబాసాహెబ్' గా తీర్చిదిద్దడంలో రమాబాయి అంబేడ్కర్ పాత్ర అసామాన్యమైనది. అందుకే రమాబాయిని 'మహోన్నత మహిళ'గా అందరూ కీర్తిస్తుంటారు. త్యాగమయ జీవితంతో కూడిన రమాబాయి జీవన ప్రయాణం అనేక కష్టాలు, దుఃఖంతో నిండి ఉంది. రమాబాయి జీవితాన్ని ఒకసారి స్మరిస్తే కళ్లుచెమ్మరిల్లుతాయి. ఈ విషయం స్వయంగా బాబాసాహెబ్కు కూడా తెలుసు. అన్ని విధాల అర్హురాలైన తన సహాచరి రమాబాయి జీవితంలో సంతోషాన్ని ఇవ్వలేకపోయానని, ఈ విషయాన్ని అనేక సందర్భాలలో బాబాసాహెబ్ అంబేడ్కర్ తన బాధను రమాబాయి ముందు, ఆమె చనిపోయిన తర్వాత కూడా వెలిబుచ్చాడు. రమాబాయికి చదువురాదనేది వాస్తవం. మరోవైపు ప్రపంచంలోనే అపర మేధావుల జాబితాలో జ్ఞానవంతుడు, ప్రజ్ఞాసూర్యుడైన ఆమె భర్త శిఖర స్థాయిలో ఉన్నారు. ప్రపంచంలోనే గొప్ప విద్యావేత్త, దార్శనికునిగా తన భర్త ఉన్నప్పటికీ, తాను నిరక్షరాస్యురాలినని రమాబాయి ఎప్పుడూ అత్మన్యూనతాభావానికి లోనవలేదు. అలాగని తన భర్త ప్రపంచ మేధావుల జాబితాలో అగ్రభాగంలో ఉన్నారనే అహంకారాన్ని ఆమె ఏనాడు చూపలేదు. ఎందుకంటే, మహెూన్నతులైన ఇరువురు జీవితభాగస్వాముల జీవితమంతా అణగారిన జాతులు, బడుగు బలహీన సమాజ ప్రజల శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితమిచ్చారు. ఓవైపు అంబేడ్కర్ సంఘర్షమయ ఉద్యమబాట వైపు నడుస్తుండగా మరోవైపు దగ్గరి బంధువులు, సన్నిహితులు బాబాసాహెబ్కు దూరమవుతూ వచ్చారు. అంబేడ్కర్, రమాబాయి దంపతుల పిల్లలు అల్పాయుష్షులోనే ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ సమాజశ్రేయస్సు కొరకు తమ ఆశయాన్ని ఎన్నడూ వీడలేదు. రమాబాయి బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులను కోల్పోయింది. అత్తవారింటికి వచ్చిన కొద్ది కాలంలోనే తన మామ (అంబేడ్కర్ తండ్రి) రామ్జీరావు కన్నుమూశారు. ఆ కొద్ది రోజుల తరువాత సవతి అత్త జీజాబాయి తనువుచాలించింది. రమాబాయి తన నలుగురు పిల్లలు ఒక్కొక్కరుగా మృత

Browse more Telugu books