Ramabai Ambedkar Jeevitha Charitra
డాక్టర్ జి.వి. రత్నాకర్ / Dr. G.V. Ratnakar · Biographies & Auto Biographies

Price: Rs. 45. బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ భార్య రమాబాయి జీవన పోరాటాన్ని తెలిపే రచన కొంత ఆలస్యంగా వచ్చిన దళిత మహిళల జీవిత చరిత్ర ల కోవలో ఒక పెద్ద లోటును పూరించింది. - డా|| బి. విజయభారతి బాబా సాహెబ్ డా|| అంబేడ్కర్ జీవితంలోకి అడుగుపెట్టి, దుర్భర దారిద్య్ర దినాల్లో వెన్నంటి ఉండి, ఆయన విద్యార్జనకు సహకరిస్తూ కుటుంబ భారాన్ని మౌనంగా భరిస్తూ ఆ మహదాశయానికి అండగా నడిచింది రమాబాయి. మానవ జాతి చరిత్రలో ఇలాంటి మహిళామణుల జీవిత చరిత్రల అధ్యయనానికి ఇదో దిక్సూచి, - డా|| అప్పికట్ల భరత్ భూషణ్ ఐఆర్ టిసి (రిటైర్డ్) డా|| జి.వి. రత్నాకర్ తెలుగు రాష్ట్రాలలో గొప్ప కవి, రచయిత దళిత బహుజన వర్గాల మేధావి, దళిత హక్కుల ఉద్యమ నాయకుడిగా గత 20 సం॥లుగా తెలుగు రాష్ట్రాలలో సామాజిక అంశాలపై వ్యాసాలు, కవ్వితం, అనువాదాలు, విశ్లేషణలు చేశారు. ఆయన రచించిన మట్టి పలక, అట్లేటి ఆల, అనువాదం చేసిన నేను అంటరానివాన్ని, జూఠన్, ఝాన్సీ ఝల్కారీబాయి, సమతా సైనిక్ళ్ ఉద్యమం- పోరాటం మొదలైన గ్రంథాలు తెలుగు ప్రాంతంలో సంచనలం సృష్టించాయి. డా.జి.వి. రత్నాకర్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ హిందీ విభాగంలో అధ్యాపకులుగా పని చేస్తున్నారు.