RAKTA GEETIKALU

కర్లపాలెం భాస్కరరావు · Novels

RAKTA GEETIKALU book cover

Price: Rs. 195. దేశ విభజన సమయంలో సరిహద్దుకు ఇరువైపులా సాగిన మత మారణకాండకు అద్దం పట్టే నవల ఇది. నేటి పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలో, సోన్ అనే చిన్న నదీ తీరంలో ఒక ప్రశాంతమైన పల్లె అది. అక్కడ మతాల పట్టింపులు లేవు. ఒకరి మతాన్ని, మరొకరు ఎంతగానో గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఇరుమతాల పండుగలను ఆనందోత్సాహాల మధ్య కలిసికట్టుగా జరుపుకుంటారు. ముస్లిములు సంఖ్య రీత్యా అధికంగా ఉన్పప్పటికీ, హిందువులు, సిక్కులు ప్రధానంగా వ్యాపారాల్లో ఉంటూ అధిక సంపన్నులుగా ఉంటారు. అయినప్పటికీ పరస్పరం ప్రేమానురాగాలు పంచుకోవడానికి ఆ అంతరాలేమీ అడ్డురావు. భానే షా అనే హిందూ పెద్ద మాట మతాలతో నిమిత్తం లేకుండా ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి వేదవాక్కు అలాంటి ప్రశాంతమైన పల్లెలోకి దేశ విభజన నాటి మతోన్మాద భావాలు తలకెక్కిన ఒక ముస్లిం మత గురువు ప్రవేశించడంతో వాతావరణం మారిపోతుంది. ఆ గ్రామంలోని ముస్లిముల లోని కొందరు యువకులను అతడు తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. వారి సహాయ సహకారాలతోనే ముస్లిం మతోన్మాద మూకలు ఆ గ్రామంపై విరుచుకు పడతాయి. గ్రామంలోని హిందూ సంపన్నుల గృహాలను దోచుకొని, తగలబెట్టేసిన మతోన్మాద మూకలు విద్రోహులు అందించిన సమాచారంతో హిందువులు తలదాచుకున్న కొండ గుహపై కూడ విరుచుకు పడతాయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఊచకోత కోస్తుంది ఆ మూక. గుహలో మరింత లోపలికి ఉండి, మతోన్మాదుల కళ్ళబడకుండా ఉన్న భానే షా, ఆయనకు తోడుగా వచ్చిన యాసిన్ అనే ముస్లిం బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. మతోన్మాద మారణకాండ నుండి బయటపడిన ఆ హిందూ వృద్ధుడు. ఆయనకు ఆసరాగా ఆ ముస్లిం యువతి కొంత సురక్షితమైన చోటుకు సాగిపోతుండగా ఈ నవల ముగుస్తుంది. నానక్ సింగ్(1897-1971) నానక్ సింగ్ను 'ఆధునిక పంజాబీ నవలా పితామహుడు'గా పంజాబీ పాఠకులు భావిస్తారు. నవలలు, కథలు, నాటికలు, కవితలు, అనువాదాలు మొత్తం 59 పుస్తకాలు రచించారు. వీటిలో 38 వరకు నవలలే ఉన్నాయి. వేగం, చక్కదనం కలిగిన ఆయన రచనా శైలి విశిష్టమైనది. ఆయన రచనలు ఎక్కువగా సామాజిక పీడనకు వ్యతిరేకంగా రాసినవే. వాటిల్లో గాంధేయ ధృక్పథం కనపడుతుంది. 1962 లో నానక్ స

Browse more Telugu books