RAJASEKHARA CHARITHRA
Sahavasi / సహవాసి · Novels

Price: Rs. 95. తెలుగులో తొలి నవలకు తెరతీసినవాడు కందుకూరి వీరేశలింగం. ఆ తొలి నవల రాజశేఖర చరిత్రము. 1880లో రాజశేఖర చరిత్రము వెలువడింది. రాజశేఖరుడి యిల్లు, ఆయన దర్జా, ఆయన అతిథి సేవ, బీరకాయ పీచు చుట్టరికాలు కలుపుతూ తేర తిండికి ఎగబడివచ్చేవాళ్లూ .... ఇదంతా ఆయన తాతలు, తండ్రుల జీవిత విశేషాలనుంచి, స్వీయానుభవం నుంచి తీసుకొన్నవే. రాజశేఖరుడు కూడా దయ్యాలు, భూతాలు నమ్మాడు. యోగుల్ని కొలిచాడు. బంగారం చేసే విద్య మీద భ్రమలు పెంచుకున్నాడు. దివాలా తీసి ఎదురు దెబ్బలు తిన్నాడు. అప్పుడు జీవితం పాఠశాల అయింది. అనుభవాలు గుణపాఠాలయ్యాయి. మూఢనమ్మకాల్ని మనస్సులోంచి పెకలించి వేశాడు. ఆనాటి భాష ఇప్పటి పాఠకులకు కొరుకుడు పడదు. దానిని సరళం చేసి వీరేశలింగం భావాలను పదిలం చేసి సహవాసి అందించారు. అదే రాజశేఖర చరిత్ర.