Rajakeeya Ardha Sastram Pradhama Pathalu
Editor · Politics

Price: Rs. 45. నర్సింహయ్య గారి గురించి నా మొదటి జ్ఞాపకం ఒక రాజకీయ పాఠశాల, ఖచ్చితంగా ఎప్పుడో జ్ఞాపకం లేదు గానీ, నేను విద్యార్థి సంఘంలో పని చేసేటప్పుడు జరిగిన రాజకీయ పాఠశాలలో ఆయన అర్థశాస్త్ర పాఠాన్ని బోధిస్తుంటే విన్నప్పుడు ఒక మంచి అధ్యాపకుడుగా నా బుర్రలో ముద్ర పడింది. మంచి భాషా, స్వచ్ఛమైన ఉచ్ఛారణ, హడావుడి లేకుండా నింపాదిగా, సుబోధకంగా చెప్పే తీరు అసలు సిసలైన ఉపాధ్యాయుడిని గుర్తుకు తెచ్చింది. ఆయన వేషభాషలు కూడా విద్యాబుద్ధులు నేర్పే అయ్యవారిని తలపించాయి. - బి.వి. రాఘవులు