Raithunu Munchuthunnna Palakula Vidhanalu

Editor · New Arrivals

Raithunu Munchuthunnna Palakula Vidhanalu book cover

Price: Rs. 90. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టడానికి తెచ్చిన నల్ల చట్టాలను రైతాంగం ఏడాది పాటు పోరాడి రద్దు చేయించింది. అయితే ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీకి భిన్నంగా అవే విధానాలను దొడ్డి దారిన అమలుకు పూనుకుంటుంది. రైతాంగాన్ని కాపాడడానికి అవసరమైన చట్టాల కోసం తిరిగి రైతాంగం ఉద్యమిస్తున్న క్రమంలో రాంభూపాల్ రాసిన వ్యాసాల సంపుటి ఎంతో విలువైనది. రైతాంగాన్ని చైతన్య పరచడానికి ఎంతో విలువైన సమాచారంతో కూడి ఉంది. సరళీకరణ విధానాలు ప్రారంభమైన నాటి నుండి నేడు రైతాంగం ఎదుర్కొంటున్న దుస్థితిని కళ్ళకు కట్టినట్లు వివరించారు రాంభూపాల్. డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథను భారతరత్న ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఆయన సూచించిన సీ2+ 50 మద్దతు ధరల చట్టం కోసం పోరాడిన రైతాంగం పై ఏడాది పాటు సాగించిన దమనకాండకు కారణం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో వరదలు వచ్చి కృష్ణ, గోదావరి నదీ జలాలు సముద్రం పాలవుతుండగా రాయలసీమ దానితోపాటు రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలు వర్షాధారంపై ఆధారపడి కరువులకు ఎందుకు గురవుతున్నాయి అని ప్రశ్నించారు. 50 ఏండ్ల నుండి ప్రతిపాదిస్తున్న రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి పాలకుల విధానాలే కారణాలని సూటిగా చెప్పారు. కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా తుంగభద్ర ప్రాజెక్ట్, అలనాటి చెరువుల నిర్వహణ ఎంత దయనీయంగా ఉన్నది. వివరించారు. స్వంతంగా బావి తవ్వుకుని, బోరు వేసుకుని, విద్యుత్ మోటారు పెట్టుకుని వ్యవసాయం సాగిస్తున్న రైతుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తెస్తున్న విద్యుత్ సంస్కరణలు ఎలా ఉరితాడు కాబోతున్నాయో స్పష్టం చేశారు.

Browse more Telugu books