Raithubiddadu Gerillaga....

Editor · Biographies & Auto Biographies

Raithubiddadu Gerillaga.... book cover

Price: Rs. 225. ఉవ్వెత్తున సాగిన నక్సలైట్ ఉద్యమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 1970-1991 మధ్య దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రజాకర్షక నాయకుల్లో కొండపల్లి సీతారామయ్య ఒకరుగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో పీపుల్స్ వార్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కాలంలో అనేక విన్నూత్న ఉద్యమ ప్రక్రియలకు బీజాలు పడ్డాయి. పీపుల్స్ వార్ను అణచివేయటమా, చర్చలు జరపటమా అన్న విషయంలో ప్రభుత్వం ఊగిసలాటకు గురైన కాలాన్ని ఉద్యమాన్ని వేగంగా విస్తరించటానికి పీపుల్స్ వార్ పార్టీ ఉపయోగించుకుంది. రైతాంగం సమీకరించబడ్డారు. పట్టణాలకు పారిపోయిన తెలంగాణ భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతారు. టీ కొట్ల వద్ద దళితులకు వేరు గ్లాసులు ఇచ్చే పద్ధతిని నిర్మూలించడానికి కృషి జరిగింది. పీపుల్స్ వార్ దళాలు, స్థానిక కార్యర్తలు బహిరంగ న్యాయస్థానాలు నిర్వహించి గ్రామాల్లో తప్పులు చేస్తున్న వారిపైన, భూస్వాములపైన, పీపుల్స్ వార్ వ్యతిరేకులపైన చర్యలు తీసుకున్నారు. దీనితో పీపుల్స్ వార్ పార్టీకి ప్రజల్లో, యువకుల్లో ఆదరణ పెరిగింది. ఉద్యమ గమనం, గమ్యంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ ఉద్యమ నిర్మాణంలో కొండపల్లి సీతారామయ్య పాత్ర అధ్యయనయోగ్యమైనదనటంలో సందేహం లేదు. ఉద్యమ సహచరులు, కొండపల్లి సీతారామయ్య సహచరులతో నిర్వహించిన ఇంటర్వూల ఆధారంగా ఆయన మనమరాలు కె. అనురాధ కొండపల్లి సీతారామయ్య జీవిత చరిత్రను సాధికారికంగా అక్షరబద్ధం చేశారు. వామపక్ష ఉద్యమ చరిత్రను అవగాహన చేసుకోవటానికి జీవిత చరిత్రలు ఓ మార్గం. సాధనం. వామపక్ష ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Browse more Telugu books