Rahasya Bharathamlo Naa Adhyatmika Anveshana
Jonnalagadda Patanjali / జొన్నలగడ్డ పతంజలి · Literature

Price: Rs. 157. 1898 లో జన్మించిన పాల్ బ్రంటన్ తూర్పుదేశాలలో విస్తృతంగా పర్యటించాడు. 1935 - 1952 మధ్య 13 పుస్తకాలు ప్రచురించాడు. ధ్యానాన్ని, యోగాని పశ్చిమదేశాలకు పరిచయం చేసినవాడుగా బ్రంటను గుర్తిస్తారు. అట్లాగే తాత్త్విక నేపథ్యం ఉన్న వీటిని అందరికీ అర్ధమయ్యే సాధారణభాషలో రచించడం కూడా బ్రంటన్లోని విశేషం. బ్రంటన్ 1981లో స్విట్జర్లాండ్లో మరణించాడు. "నేను యోగులకోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను... ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ పవిత్రనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్లింది..." ఆధ్యాత్మిక యాత్రా రచనలో రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఒక ఉదాత్త రచన. ఒక సునిశితమైన దృష్టితో ఉదార దృక్పథాన్ని మేళవించి పాల్ బ్రంటన్ భారతదేశంలో ఒక మూలనుండి మరో మూలకు తన ప్రయాణాన్ని వర్ణించాడు. ఆత్మజ్ఞానం ద్వారా వచ్చే ప్రశాంతతను తనకు ఎవరు ఇవ్వగలరో అన్వేషిస్తూ అతను యోగులు, తాంత్రికులు, గురువుల మధ్య జీవించాడు. అతని అన్వేషణ అరుణాచలంలో శ్రీ రమణమహర్షితో ముగిసింది. ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా- మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈ గ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండు రోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు, 1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.