Raguluthunna Adavi

Editor · Politics

Raguluthunna Adavi book cover

Price: Rs. 275. బస్తర్ ఘర్షణల మధ్య కత్తి మీద సాము చేస్తూ ఏ దశలో కూడా బస్తర్ ఆదివాసీల పట్ల తన నిష్కల్మషమైన ప్రేమతో రాజీపడలేదు. సామాజిక శాస్త్ర, పరిశోధనా రంగానికి నందినీ సుందర్ స్ఫూర్తిదాతే కాక ఒక విలువైన రోల్ మాడల్. - ప్రొ॥ హరగోపాల్ "ఎటువంటి సంచలనాత్మకత లేని క్షుణ్ణంగా పరిశోధించి, రాసిన పుస్తకం. అందుకే మరింత ఆందోళన కలిగిస్తుంది..... ఈ ప్రాంతంలో "అభివృద్ధి" రూపురేఖలను హత్య, విధ్వంసం, వినాశనాలతో కూడిన వ్యూహ రచన తీర్చిదిద్దుతోంది. ఒకసారి పట్టుకుంటే అపకుండా చదివిస్తుంది. భారత ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేసేవాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం. - గిరీష్ కర్నాడ్ 'బస్తర్లోని హింసాత్మకమైన ఎదురు కాల్పుల మధ్య చిక్కుకుపోయిన సమూహాల, జీవితాల గురించి లోతుగా అధ్యయనం చేసి, నిబద్ధతతో, మెదడుకి హత్తుకుపోయేలా రాసిన పుస్తకం. ఇది రాజ్యాన్ని నిశితంగా విమర్శిస్తుంది. భారత ప్రజాస్వామ్యం దానిని వినాల్సిన అవసరం ఉంది. - ప్రతాప్ భాను మెహతా లోతైన అర్హతతో, అవగాహనతో రాసిన ఆందోళన కలిగించే ఈ పుస్తకం మనల్ని మన ఉదాసీన వైఖరి నుంచి కదిలించి, బస్తర్ యుద్ధంలోని దారుణ వాస్తవాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. - షర్మిలా టాగూర్ 'ఆలోచించే ప్రతి భారతీయుడు, గణతంత్ర ప్రస్తుత భవిష్యత్తుల గురించి ఆలోచించే ప్రతి పౌరుడు 'రగులుతున్న అడవి' అన్న పుస్తకాన్ని చదవాలి. ఎంతో క్షుణ్ణంగా పరిశోధించి, అద్భుతంగా రాసిన పుస్తకం. దీని నిండా లోతైన అవగాహనలు ఉన్నాయి. అంతేకాదు, దీనిని రాయటంలో ఎంతో ధైర్యాన్ని కూడా ప్రదర్శించారు. - రామచంద్ర గుహ, హిందుస్తాన్ టైమ్స్

Browse more Telugu books