Rachayathri

Ranganayakamma · Novels

Rachayathri book cover

Price: Rs. 75. ఈ నవల నేను 1965లో రాశాను. ఇప్పటికి 43 సంవ త్సరాల కిందట. అప్పుడు ఈ కధా విధానం అంతా బాగానే నచ్చింది. నచ్చింది కాబట్టే అలా రాశాను. తర్వాత పుస్తకంగా కూడా గతంలో 6 ముద్రణలు వచ్చింది. కానీ ఎప్పుడో అసంతృప్తి ప్రారంభమైంది. అక్కడక్కడా తప్పులు తోచడం, విమర్శలు తలెత్తడం, ప్రారంభమయ్యాయి. ఇక దీని పునర్ముద్రణని ఆపివెయ్యాలనే ఆలోచన కూడా కొన్నాళ్ళు సాగింది. కానీ ఆ కథ మంచిది. దాన్ని పూర్తిగా ఆపివెయ్యడం కూడా ఇష్టం లేకపోయింది. ఇక మిగిలిన మార్గం, అదే కధని మళ్ళీ రాయడమే. ఆ పనే చేశాను. సర్దుళ్ళూ దిద్దుళ్ళూ, మార్పులూ చేర్పులూ జరిగే సరికి, నవలలో నూటికి 90 పాళ్ళు మారింది. ఈ తిరిగి రాసే పని' 2007 చివర్లో జరిగింది. ఈ మారిన నవల, 'ఆంధ్రప్రభ' దిన పత్రికలో, డైలీ సీరియల్గా, 2008 ఫిబ్రవరి 3 నుంచీ, దాదాపు 5 నెలలపాటు వచ్చింది. ఒకే పేరూ, దాదాపు ఒకే కధా గల నవలని, 40 సంవత్స రాల తర్వాత మళ్ళీ రాయడమూ, ఒకే నవలని 2 సార్లు సీరి యల్ గా ప్రచురించడమూ, దీని విషయంలో జరిగాయి. 'ప్రభ'లో సీరియల్ ప్రచురణ ముగిసిన తర్వాత కూడా, నవలలో కొన్ని సందర్భాల్లో మళ్ళీ కొన్ని కొత్త పేరాలు రాశాను. అదంతా ముగిసిన తర్వాతే, సవరించిన కథకి, పుస్తకంగా ఈ మొదటి ముద్రణ.

Browse more Telugu books