Racharikam
Editor · Novels

Price: Rs. 180. బాబా సాహెబ్ అంబేడ్కర్ మహానిర్యాణం తర్వాత దళిత ఉద్యమంలో తలెత్తిన అస్తవ్యస్తలకు అక్షర రూపం ఇచ్చిన నవల ఇది. 1956 నుంచి 1996 వరకూ నాలుగు దశాబ్దాలుగా దళిత ఉద్యమంలో చోటు చేసుకున్న పరిణామాలను మహారాష్ట్ర కేంద్రంగా అక్షర రూపం ఇచ్చిన ఈ రచన అంబేడ్కర్ అనంతర దళిత చైతన్య స్థితిగతులను అత్యంత సృజనాత్మకంగా వ్యక్తి వ్యవస్థల సంఘర్షణ నేపథ్యంలో అక్షరీకరించింది. దళిత ఉద్యమంతో బాటే అవిష్కరించిన దళిత సాహిత్యం, రాజకీయాలను ప్రతిభావంతంగా వ్యక్తీకరించిన ఈ కథనం నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమం, అధికారం, సగటు మనిషిని నిర్భయంగా ఆడిట్ చేస్తుంది. మరాఠీలో సర్వాసర్ పేరుతో వెలువడిన ఈ నవలను రంగనాథ రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు.