Rabandu Valina Nela

Editor · Literature

Rabandu Valina Nela book cover

Price: Rs. 160. సరిగ్గా ఇరవై ఏళ్ల కింద 1991 జూలై 1న కేంద్రప్రభుత్వ విధాన ప్రకటనతో ఈ దేశంలో ప్రపంచీకరణ విధానాలు మొదలయ్యాయి. పి.వి.నరసింహారావు ప్రధాన మంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా, పి.చిదంబరం వాణిజ్యమంత్రిగా ఉన్న కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆ నూతన ఆర్థిక విధానాలు అంతకు ముందు నుంచీ కొనసాగుతున్న పాలకవర్గ దోపిడీ, పీడనలను మరింత తీవ్రతరం చేశాయి. ఒక మలుపు తిప్పాయి. దేశాన్ని సామ్రాజ్యవాద రథచక్రాలకు మరింతగా కట్టివేశాయి. ఈ దేశ వనరులను దేశదేశాల సంపన్నులకు భోజ్యంగా మార్చాయి. ఈ దేశ శ్రామికులను, పీడితులను మరింత దారిద్య్రంలోకి పీడనలోకి నెట్టాయి. ఆ తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న అన్ని పార్లమెంటరీ రాజకీయపక్షాలూ ఆ విధానాలను కొనసాగించాయి. అలా ఈ రెండు దశాబ్దాలలో వేరువేరు రూపాలలో, వేరువేరు రంగాలలో సాగుతున్న రాజకీయార్థిక విధానాల మీద సమకాలీన స్పందనల, వ్యాఖ్యల, విశ్లేషణల సంకలనం ఇది. నూతన ఆర్థిక విధానాల ప్రకటన జరిగిన పది రోజులకు 1991 జూలై 12న అచ్చయిన వ్యాసంతో ఎన్. వేణుగోపాల్ ఆ విధానాలతో సంవాదం ప్రారంభించారు. గడిచిన ఇరవై సంవత్సరాలలో ప్రపంచీకరణ రాజకీయార్థిక అంశాల పై రాసిన దాదాపు రెండు వందల నలభై వ్యాసాలలోంచి ఎంపిక చేసిన వ్యాసాల సంకలనం ఇది.

Browse more Telugu books