QURBAANI
Syed Gaffar / సయ్యద్ గఫార్ · Stories & Poetry

Price: Rs. 180. ఈ కథలు చదువుతుంటే గఫార్ లోని మానవీయ కోణం మనకు అర్ధం అవుతుంది. అత్యంత సహజంగా గఫార్ కథనం, సంభాషణలు వుంటాయి. ముస్లిం జీవితాల్లోని అనేక కోణాలు, సమస్యలు అతనికి తెలుసు. అలాగే తెలంగాణ భాష, యాసల మీద మంచి పట్టు వుంది. ఇన్ని దశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు రాలేదన్న బాధ రచయితది. అందుకే ఈ కథల నిండా అనేక ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం మనందరం వెతకాలి, చెప్పాలి. రాజకీయ పరంగా గఫారికి కొన్ని అభిప్రాయాలున్నాయి. అయినా జీవితాన్ని చిత్రించటానికే ఎక్కువ ఇష్టపడతాడు. . నినాదాల జోలికి పోడు. - పి. చంద్రశేఖర అజాద్ మొత్తంగా గఫార్ కథలు ప్రస్తుత సమాజానికి అవసరమైనవి. ఎక్కడా వివక్షను కసితోనో, ఆగ్రహంతోనో రచయిత వ్యక్తం చేయలేదు. తాను తెర వెనక ఉండి పాత్రలు సజీవంగా సంచరిస్తూ తమతమ జీవితాలను వ్యక్తీకరిస్తాయి. రచయిత జోక్యం లేకపోవడం, పాత్రలు కూడా ఈర్ష్యాద్వేషాలను, ఆగ్రహాలను వ్యక్తం చేయకపోవడం చూస్తాం. ఇటువంటి ప్రేమపూరితమైన కథలను రాసిన గఫార్ అభినందనీయడు. ఈ పుస్తకంలోని కథలను చదివితే గఫార్ మానవీయ దృక్పథం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. - కాసుల ప్రతాపరెడ్డి