Pusina punnami
Gorati Venkanna · Stories & Poetry

Price: Rs. 90. నిశ్శబ్ద మరణంలో అణగారిపోతున్న అందమైన జ్ఞాపకానికి ఒక కవి కాపలా కాస్తున్నాడు. మృత్యువూ శైథిల్యమూ పరివేష్టించిన వల్లకాటి పేరోలగంలో అతనొక్కడు ఇంకా బతుకు పాట పాడుతున్నాడు. వేనవేల ఏండ్లుగా ఎడతెగని సీతమ్మ విషాదాన్ని మోసుకు తిరుగుతున్న బాల సంతువలె పల్లెను దాని పచ్చిగాయాలను దాని వెచ్చటి గాథలను అతను పరవశించి గానం చేస్తున్నాడు. నోరులేని పాలమూరు పల్లెను గొంతులో జీరగా నిలుపుకుని సమూహ దుఃఖాన్ని అతను పలుగురాళ్ళు నమిలినట్టున్న పదాలలోకి అనువదిస్తున్నాడు. నరులను భయపెట్టే కటిక చీకటికి కూడా ఏకునాదంతో ఎరుకను బోధించే బైరాగివలె అతను మనిషి మనసులోని గుయ్యారాలను వెలిగిస్తున్నాడు. గోరటి వెంకన్న తెలంగాణ కావలసి వచ్చిన కాలానికి ఎదిగి వచ్చిన పుత్రుడు.