Purananama Chandrika

Editor · Books

Purananama Chandrika book cover

Price: Rs. 108. తరవాతి కాలంలో పూర్వ గాథాలహరి వంటి ప్రచురణలు వచ్చినా ఈ గ్రంథ గౌరవానికి భంగం లేదనటానికి అందులో లేని 872 కొత్త మాటలు ఇందులో ఉండటమే నిదర్శనం. ఇందులోని వివరణలు సంక్షిప్తంగా ఉన్నా విషయలోపం కనిపించదు. భారతీయ వాత్యంలోని ప్రధాన పాత్రలను గురించి స్థూలంగానయినా తెలుసుకోడానికి ఈ నిఘంటువెంతో ఉపకరిస్తుంది. నిఘంటువు అకారాదిక్రమంలో ఉన్నందువల్ల పాఠకులకు మరింత సహాయకారి... ఇందులో కొందరు తెలుగు కవులను వారు చిత్రించిన పాత్రలను చేర్చటం మరో విలక్షణత... సాహిత్యాభిమానులూ ప్రాచీనేతిహాసాదులను అధ్యయనం చేశేవారు తప్పక చదవ దగిన నిఘంటువిది.'" - బూదరాజు రాధాకృష్ణ, ఈ నాడు, 27.11.94 "ఇందులో - పురాణ, కావ్య నాటకాది సంస్కృతాంధ్ర గ్రంథాల వివరాలున్నాయి. ఆ నాటికి వీటిలో అధిక భాగం రాతప్రతుల రూపంలోనే వున్నాయి. పురాణ పురుషుల, దేవతల, ఋషుల, కొందరు కవుల వివరాలున్నాయి. ప్రాచీన భారత దేశంలో గల పర్వతాలు, నదీనదాలు, పట్నాలు, ప్రదేశాలు, భూములు మొ. వివరాలు గలవు. గ్రంథాంతంలో పురాణాలలో తరచుగా వచ్చే బ్రహ్మ, పురూరవుడు, యదువు, పూరువు వంశం వారి వంశవృక్షాలు ఎంతో విపులంగా వున్నాయి. చివరగా మగధ దేశాన్ని పాలించిన రాజులైన బృహద్రధుని మొదలు శూద్రకుని వరకు అందరి వివరాలు వారు పరిపాలిచిన సంవత్సరాల సంఖ్య కలదు. ''అపూర్వమైన ఈ రిఫరెన్సు గ్రంథం ప్రతి గ్రంథాలయంలో, ప్రతి కవి, పండితుని వద్ద విధిగా ఉండదగిన ప్రయోజనకర గ్రంథం” -

Browse more Telugu books