Puranalu - Kula Vyavasta III Shatachakravartulu

డా|| బి. విజయభారతి / Dr. B. Vijayabharathi · History

Puranalu - Kula Vyavasta III Shatachakravartulu book cover

Price: Rs. 45. "భారత దేశం వర్గ సంఘర్షణల నిలయమే కాదు, పోరాటాల భూమి కూడా. అలాంటి వర్గ పోరాటాలలో అత్యంత తీవ్రమైనది బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య జరిగినటువంటిది. ఈ రెండు వర్ణాల మధ్య జరిగిన వర్గ పోరాటాన్ని ప్రాచీన భారతీయ సారస్వతం చక్కగా చిత్రించింది. మొట్ట మొదట నమోదయిన సంఘర్షణ బ్రాహ్మణులకు క్షత్రియుడైన వేనునికి మధ్య జరిగినటువంటిది... బ్రాహ్మణులకు క్షత్రియరాజు పురూరవునికి మధ్య జరిగిన పోరాటం. రెండవది... బ్రాహ్మణులకు సహుషునితో జరిగిన ఘర్షణ మూడోది... నిమికి బ్రాహ్మణులకు జరిగిన సంఘర్షణ నాల్గవది" అన్నారు డా. అంబేద్కర్ గారు. (డా. బాబాసాహెబ్ రచనలు ప్రసంగాలు 2.3 . 55) ఆ స్ఫూర్తితో చేసిన పరిశీలన ఇది. వర్ణధర్మ వ్యవస్థను ప్రతక్షంగానూ పరోక్షంగానూ ప్రచారం చేసిన షట్చక్రవర్తుల కథల పరిశీలన ఈ గ్రంథంలో చూడవచ్చు. డా|| బి. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేద్కర్, పూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి. పురాణాలు- కులవ్యవస్థ పైన ఇది మూడవ పుస్తకం. మొదటిది సత్య హరిశ్చంద్రుడు, రెండవది దశావతారాలు.

Browse more Telugu books