Puranala - Kula Vyavasta- 2 Dasaavataralu

డాక్టర్ బి. విజయ భారతి / Dr. B. Vijaya Bharathi · Caste, Religion & Culture

Puranala - Kula Vyavasta- 2 Dasaavataralu book cover

Price: Rs. 35. "జనసామాన్యాన్ని విద్యావంతులను చేయటంలో వైఫల్యానికి ప్రాచీన ప్రపంచాన్ని మొత్తంగా తప్పుపట్టవచ్చు. కాని ఏ సమాజం కూడా దాని మతానికి సంబంధించిన గ్రంథాలను ఆ సమాజంలోని ప్రజలు చదవకుండా చేసే నేరానికి పొల్చడలేదు. సామాన్యుడు జ్ఞాన సముపార్జన చేయటం అనేది శిక్షించదగిన నేరం అని ప్రకటించడానికి ప్రయత్నించిన సమాజం ఏదీలేదు. హిందూ మతానికే ఆ కీర్తి దక్కుతుంది. చదవటం, రాయటం అనేవి అగ్రవర్ణాల వారి హక్కుగానూ, నిరక్షరాస్యత నిమ్న వర్ణాల తలరాత గానూ మనుధర్మ సూత్రాలు నిర్దేశించాయి." డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు- ప్రసంగాలు సం.3 (పుట 48, 49) వేదాల బోధనకు, అధ్యయనానికి సంబంధించి మనువు రూపొందించిన సూత్రాలు హిందూ సమాజ విద్యావిధానాన్ని తెలుపుతున్నాయి. హిందూమతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారు వేదాలను చదవవచ్చు. వీరిలో బ్రాహ్మణులకు మాత్రమే వేదాలను బోధించే అధికారం ఉంది. శూద్రుని విషయంలోకి వస్తే అతడు వేదాన్ని చదవటానికి మాత్రమే కాదు చదువుతుంటే వినటానికి కూడా అనుమతి లేదు. అనుమతి లేకుండా వేదాన్ని విని నేర్చుకున్న వాడు వేదాన్ని దొంగిలించినవాడు అవుతాడు అందువల్ల నరకాన్ని పొందుతాడు - అన్నాడు మనువు (1-116). తర్వాతి సూత్రకర్తలు శూద్రులు వేదాలు చదవటం, వినటం, నేరమని తీర్మానించటమే కాక ఎన్నో కఠిన శిక్షలు విధించి పెట్టారు. వేదాన్ని సంపూర్ణంగా నేర్చుకుంటే అతని శరీరాన్ని ముక్కలుగా నరికేయాలన్నాడు గౌతముడు (12-4). మత్స్యావతారం ఇదే అమలు జరిపింది. దశావతారాలలోని ఇతర అవతారాలు కూడా ఇలాంటి సామాజిక నియంత్రణ విధానాలనే అమలుపరచటం ఈ పరిశీలనలో గమనించవచ్చు. డా|| విజయభారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేద్కర్, పూలే రచనలు ప్రముఖమైనవి.

Browse more Telugu books