Punjutoka

కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి / Kothakota Srinivas Reddy · Stories & Poetry

Punjutoka book cover

Price: Rs. 95. తెలుగంటే నాకిష్టం. మాతృభాషే కదా ఇందులో విశేషమేమి అనవచ్చు. కాని తెలుగు నాకిష్టమని చెప్పడానికి ఇంకా కొన్ని హేతువులున్నాయి. ఒకటి: మా పితామహులు ఆయన పరమపదించే వరకూ కూడా ఎప్పుడో ఆయన చిన్నప్పుడు మద్రాస్ స్కూల్ లో చదివిన రామాయణ, మహాభారత పద్యాల్ని చుట్టాల్ని, ఊరంతటినీ పోగేసి రాగయుక్తంగా పాడి వినిపించడం - అలా ఆయన పాండిత్య మహిమకు నేచిన్నపుడే ఆకర్షితమవ్వడం (ఓ సందర్భంలో తిరుపతి వేంకట కవులు మా తాతగారి తెలుగు ప్రావీణ్యం గుర్తించి 'రెడ్డిగారు మీరెందుకు మాతో పాండిత్య సభలకు రాకూడదు" అన్నారని అప్పటి పెద్దలు చెప్పేవారు. ఆయన వెళ్ళలేదనుకోండి!!); రెండు: నేను చదువుకున్న అన్ని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో తెలుగు సబ్జెక్ట్ ను అద్భుతంగా బోధించే ఉపాధ్యాయులు/లెక్చరర్లు లభించడం, వారు కూడా నాకు భాషపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించడం, అందువల్లనే నాకు ప్రాథమిక పాఠశాల స్థాయినుండి తెలుగు బోధవాంశంగా ఉన్న డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు నాకు గుర్తున్నంత వరకూ తెలుగులో ఫస్ట్ మార్క్ నాదే కావడం వల్ల తెలుగు నా స్వంత భాష అనే ఓ ప్రత్యేక అభిమానం ఏర్పడడం: మూడు: డిగ్రీ కళాశాలలో తెలుగుభాషపై పట్టున్న సహవిద్యార్థుల సహచర్యం లభించడం (ముఖ్యంగా కవిత్వమంటే ప్రేమయుండి కవితలు వ్రాసేవారు) మేమందరం అనేక ఆధునిక తెలుగు సాహిత్యకారుల రచనలు చదవడం, చర్చించడం వల్ల భాషపై ఇంకా ఎక్కువ అనురాగం కలగడం; నాలుగు: డిగ్రీలోని మూడు ఏండ్లలో రెండుసార్లు నేను మా కళాశాల సాహితీ సంఘానికి కార్యదర్శిగా ఉండడం కూడా భాషతో నా అనుబంధం పెరగడానికి కారణం అయ్యింది. ఆ రెండు సంవత్సరాలలో కొన్ని సాహితీ పత్రికలు, కవితా గోష్టులు వగైరా కళాశాల స్థాయిలో నిర్వహించాము.

Browse more Telugu books