Pullampeta Jaricheera

Sripada Subrahmanya Sastry / శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి · Books

Pullampeta Jaricheera book cover

Price: Rs. 405. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గురించి జననం : 23-4-1891 * మరణం : 25-2-1961 "శ్రీపాదవారి కథలు వినివుండకపోతే తెలుగుల వునికి అయోమయం. చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన. తీయందనపు తీయందనము చవులిచ్చినదాయన శైలి. ఆయన రచనలు మరో భాషకు లొంగవు. జాను తెలుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీ శాస్త్రిగారి కథలు చదివి ఆనందించే అదృష్టం." - మల్లాది రామకృష్ణ శాస్త్రి. "అచ్ఛమైన వ్యావహారికాంధ్రం వ్రాసిన వారిలో ప్రథమ గణ్యులు శ్రీపాద వారు" - పిలకా గణపతి శాస్త్రి. "సర్వదా తమరీనాటి యాంధ్ర వ్యావహారిక భాషా నిర్మాత్రుగణ ప్రథమగణనీయులు" - విశ్వనాథ సత్యనారాయణ. "ప్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రిగారు. ఆ సంస్కృతి పాత్రల చేత ప్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరు. - కొడవటిగంటి కుటుంబరావు. "శ్రీపాదవారు యదార్ధముగా ఆయన చూపులకు కనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు మూటగట్టుకొని కథలలో బెట్టి కళ కట్టించును." - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. "భాషా విషయకంగా ఎంత వ్యవహార వాదియో, భావవిషయంలో అంత తెలుగువాడు-సుబ్రహ్మణ్యశాస్త్రి, ఏ సహృదయున్నైనా తెలుగు భాషలో తెలుగు కథ రాసిన ఖ్యాతి ఎవరికి దక్కుతుందని అడిగితే నిర్మొహమాటంగా 'వడ్లగింజలు' రాసిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారిదే ఆ ఖ్యాతి అని చెప్పి తీరుతారు. - ఉషశ్రీ. వీరు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిషం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు. శ్రీపాదవారు తమ కథలను వారు చిన్న కథలని పిలిచినా అవన్నీ ఓరకంగా నవలికలనే అనవచ్చు. వస్తువురీత్యా - ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, చారిత్రాత్మకం, అవహేళనాత్మకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాదవారు ఇవే కాక పద్య రచనలు, నాటకాలు, రూపకలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన రచనలు అనువాదాలు, వైద్యగ్రంథాలు కూడా రాశారు. వీరు వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవిసింహుడు, భటాచార్యుడు, కౌశికుడు అనే మారుపేర్లతో శతాధిక వ్యాసాలు రా

Browse more Telugu books