prema
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 95. ఆమె పేరు వేద సంహిత! వైవాహిక జీవితం ఆమె మెడమీద భర్త పెట్టిన కత్తిగాటునే మిగిల్చింది బ్రతుకుబాటలో ముందుకు సాగిపోయే తరుణంలో ఆలంబనగా ఒక అనుభవాన్ని అనుభూతినీ మిగుల్చుకోవాలనుకుంది. ఆమె జీవితంలో అభిషేక్ అపురూపంగా ప్రవేశించాడు. వెన్నెల్లో గోదారి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా మారింది. వ్యక్తిగతమైన ప్రేయసి విశ్వజనీయమైన ప్రేమగా మార్చుకోవడానికి అతను వెళ్ళిపోయేడు. ప్రతి పదమూ సరిగమ పదముగా ప్రతి వాక్యమూ ఒక సరళీస్వరముగా - ప్రతి ఉపమానమూ అపురూపముగా మీ అభిమాన రచయిత స్వరకల్పన చేసిన మృదుమధుర మంజుల నవలా నాదం.