Pravahinche Utthejam Chegevara

Editor · History

Pravahinche Utthejam Chegevara book cover

Price: Rs. 180. చే గెవారా అతన్ని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికోపరి మితం చేసిం చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికీ, భవిష్యత్తులోకీ ప్రవహించే ఉత్తేజం. చే- ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్ని నడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచివేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్చరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపిం చిన అచ్చమైన మనిషి, విప్లవ స్వప్నాలను ప్రపంచీకరించిన భావుకుడు, విప్లవం జీవితమంత విశాలమైనదని చాటి చెప్పిన విప్లవకారుడు. చే జీవితాన్నీ, ఉద్యమాన్నీ గురించి ఎందరో పరిశోధకులూ, రాజకీయవేత్తలూ విశ్లేషించారు. అతని జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను యీ పుస్తకం మళ్ళీ మన ముందుకు తెస్తుంది. ఈ పుస్తక రచయిత కాత్యాయని అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 'చూపు' పత్రిక సంపాదకురాలుగా ఉన్నారు.

Browse more Telugu books