Pratighatana

డా. చల్లా భాగ్యలక్ష్మి / Dr. Challa Bhagya Lakshmi · Biographies & Auto Biographies

Pratighatana book cover

Price: Rs. 180. జీవితం సినిమా కాదు. ఒకే హీరో, ఒకే హీరోయిన్, ఒకే విలన్ ఉండటానికి, మన జీవితానికి మనమే హీరో మీకైనా, నాకైనా, కానీ నేపథ్యాలు మారిపోతాయి. పరిస్థితులు మారిపోతాయి. తరాలు మారిపోతాయి. మన చుట్టూ ఉన్న మనుషులు. వారి మనస్తత్వాలు మారిపోతాయి. హీరోగా ప్రారంభమయిన మనం రకరకాల మలుపులు తిరిగి అనేక పాత్రల్లో ఒదిగిపోతాం. వాస్తవానికి నేను ఎప్పుడూ హీరో కావాలని అనుకోలేదు. అలాగని విలన్ అవ్వాలనే కోరిక లేదు. ఇంట్లో ఇబ్బంది లేని జీవితం. పదంకెలలో కాకపోయినా ఐదంకెలలో బ్యాంకు బ్యాలెన్స్.. బయటకు వెళ్లే మనని చూసి నవ్వే కొన్ని మొహాలు. ఇవి చాలనుకున్న ఒక సామాన్యమైన మధ్యతరగతి జీవితం నాది. కానీ ఎక్కడో. మనస్సులో ఏదో మూల వేషం అంటే ఇష్టం. నాటకం అంటే మోహం. ఆ మోహం నన్ను మొహానికి రంగు పూసుకొనేలా చేసింది. చిరాకులు, చీదరింపులు, అవమానాలు అన్నీ భరించే శక్తినిచ్చింది. మొన్న నేను పోయానని అందరూ నివాళులు అర్పించటానికి సిద్ధపడిపోయి నప్పుడు- నన్ను నిలబెట్టింది ఆ అనుభవాలే!

Browse more Telugu books