Prapancha Prajala Charithra

Editor · Best Selling

Prapancha Prajala Charithra book cover

Price: Rs. 200. ఇది రాజులు, రాజ్యాల చరిత్రకాదు. తేదీల కూర్పు అంతకన్నా కాదు. ఇది ప్రజల చరిత్ర. చారిత్రక క్రమంలో కీలకమైన సంఘటనలు, పరిణామాలు, వాటికి కారణాలు, వాటివెనక ఉన్న శక్తులు, వాటిలో పాలు పంచుకున్న ప్రజల పాత్ర గురించి స్థూలంగా వివరిస్తుంది ఈ పుస్తకం. మానవ జాతి చరిత్రలో ఆదిమ సమాజం నుండి రోమన్ మహా సామ్రాజ్యం వరకు, మధ్య యుగాల నుండి పునర్వికాసం, పారిశ్రామిక విప్లవం, దాని తర్వాత బూర్జువా విప్లవాల వరకు, కార్మిక వర్గ పోరాల నుండి చరిత్రలో తొలి కార్మిక వర్గ విప్లవమైన పారిస్ కమ్యూన్ వరకు పరిణామ క్రమాన్ని ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. క్రిస్ హార్మన్ 'సోషలిస్టు వర్కర్' పత్రిక సంపాదకులు, తూర్పు ఐరోపాలో వర్గపోరాటాలు, మార్క్సిజం ఎలా పని చేస్తుంది?, కోల్పోయిన విప్లవం: జర్మనీ 1918-1923 తదితర గ్రథాలు రచించారు.

Browse more Telugu books