Prapancha Cinema Charitra

Editor · Literature

Prapancha Cinema Charitra book cover

Price: Rs. 740. కథ, నవల, అనువాదం తదితర సాహితీ ప్రక్రియలలో తరచుగా వినిపించే పేరు అరిపిరాల సత్యప్రసాద్. ఈయన వెలువరించిన ఊహాచిత్రం (కథలు, 2013), జరుగుతున్నది జగన్నాటకం (నవల, 2020), రూపాయి చెప్పిన బేతాళ కథలు (ఆర్థికపాఠాలు, 2019) విశేష గుర్తింపు పొందాయి. ఫ్రెంచ్ రచయిత్ గై ది మపాసా కథలు, రష్యన్ రచయిత దాస్తోయేవ్స్క కథలు, హిందీ నవల పట్నా బ్లూస్ (పాట్నా ఒక ప్రేమ కథ) తెలుగు అనువాదాలు వీరి ఇతర రచనలు. ఈయనకున్న అపారమైన ప్రపంచ సినిమా జ్ఞానం 2006 నుంచి 2015 వరకు నవతరగం ఆన్లైన్ పత్రిక, చిత్ర మాసపత్రికలలో వచ్చిన వ్యాసాలలో, రివ్యూలలో చూడచ్చు. పలు తెలుగు చిత్రాలకు రచయితగా, నటుడిగా కూడా పని చేశారు. కోవిడ్ లాక్ డౌన్ కాలంలో మొబైల్ ఫోన్ మాత్రమే వాడి, కుటుంబ సభ్యులే క్యాస్ట్ ఎండ్ క్రూగా తీసిన Locked (2021) అనే చిన్న సినిమా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడి పురస్కారాలు అందుకుంది. ఇది సాధారణమైన కార్యం కాదు. ఒక విశ్వవిద్యాలయంలాంటి కేంద్రంలో కొందరు పరిశోధకులు కలిసి చేయవలసిన పని. ఇటువంటి భారాన్ని సత్యప్రసాద్ అనే ఏకైక వ్యక్తి తన భుజస్కంధాల మీద వేసుకొని, మోసి ఎక్కడా రాజీపడకుండా ప్రజల ముందుకు తీసుకురావడం అనితరసాధ్యం. సినిమా ప్రేమికులే కాదు, మానవజాతి చరిత్ర తెలుసుకోవాలనుకే వారందరికీ ఇదొక అమూల్యమైన కానుక. - సింగీతం శ్రీనివాసరావు. దీన్ని ఒక్కసారి తిరగెయ్యగానే సినిమా ప్రేమికుడిగా కళ్ళకద్దుకున్నా... కొన్ని భాగాలు చదివాకా... గుండెలకద్దుకున్నా... నిజంగా ఇది వది PhDల పెట్టు... చలనచిత్ర సాహిత్యంలో చాలామంది సాధించలేని మరో మెట్టు.... ప్రతీ పేజీలోనూ సత్యప్రసాద్ పడ్డ శ్రమ తెలుస్తోంది... ఇష్టం కనిపిస్తోంది. - తనికెళ్ళ భరణి

Browse more Telugu books