Prapancha Arthika Sankshobam
Editor · Cinima

Price: Rs. 10. నేడు ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, దానికి అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిఉన్నాయి. 2008లో ఆరంభమయిన ఈ సంక్షోభం నుండి భారీ బెయిలవుట్ పథకాల ద్వారా బయటపడుతున్నదని భావించినప్పటికీ, ఆ ఉపశమనం ఎంతో కాలం నిలవలేదు. మరో సారి ఆర్థిక సంక్షోభం తలెత్తి దాన్ని నుండి బయటపడటం అసాధ్యం అన్న రీతిలో అల్లుకుపోయింది. పెట్టుబడిదారీ సంక్షోభాల పుట్టుపూర్వోత్తరాలను, పర్యవసానాలను సులభంగా అర్ధమయ్యేరీతిలో వివరిస్తుంది ఈ చిన్న పుస్తకం. భారత దేశంతో సహా ప్రపంచవ్యాపితంగా పెట్టుబడిదారీ దేశాలలో అమలవుతున్న సరళీకృత, ప్రంపచీకరణ విధానాలనూ ఈ పుస్తకం ద్వారా అర్ధం చేసుకోవచ్చు. వర్తమాన ఆర్థికపరిణామాల పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. అమానూల్లా ఖాన్ బీమా ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిన్ అసోసియేషన్ (AlIEA) అధ్యక్షులు. సంఘ పత్రిక ఇన్సూరెన్స్ వర్కర్ సంపాదకులు. బెంగుళూరు నివాసి.