Prakruti Vyavasayaniki Bahujana Batukamma
సి. అనిత కుమారి, వంగల సంతోష్, మోత్కూరు శ్రీనివాస్ / C. Anita Kumari , Vangala Santhosh , Motyuru Srinivas · Books

Price: Rs. 135. సామ్రాజ్యవాద ప్రపంచీకరణవిధానాలు దేశంలో తీవ్రమై మూడు దశాబ్దాల్లో వాటి దుష్ఫలితాలను మనం స్పష్టంగా చూస్తున్నాము. ఈ మూడు దశాబ్దాల్లో అత్యధిక విధ్వంసానికి గురైనది మన వ్యవసాయరంగమే అని చెప్పవచ్చును. కోవిడ్-19 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అదే వ్యవసాయరంగం, ఆరోగ్య రంగాల ప్రాధాన్యత మళ్ళీ పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. బహుజన బతుకమ్మ పదవ ఏడులోనికి ప్రవేశిస్తూ వ్యవసాయిక రంగాన్ని విధ్వంసకర సంస్కరణల ఊబిలోంచి బయటకు తీసుకువచ్చే అంశాన్ని భుజానికెత్తుకోవడం ఎంతో సరైందని ఎల్లెడలా మాకు లభిస్తున్న ప్రోత్సాహమే నిదర్శనం. భారత వ్యవసాయరంగ ముఖచిత్రాన్నే మార్చేసే ఈ కర్తవ్యాన్ని, భావసారూప్యత కలిగిన శక్తులందరితో కలిసి ఐక్యంగా చేయాల్సిన అవసరం ఉంది. కోరిందే తడువుగా ఈ విషయంలో అనేకమంది తమ భావాలను, అనుభవాలను వ్యాసాలుగా రాసి పంపారు. ప్రకృతి పంటలు, సహజ వంటల్లో ప్రవేశమున్న వారు, ప్రజాసాంస్కృతికోద్యమ కార్యకర్తలు, పలు రంగాల్లో పరిశోధనలు చేస్తున్న వాళ్లు ఎంతో మంది తమ అభిప్రాయాలను తెలియచేశారు. వీరందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. అనేక మంది తమ వ్యక్తిగత విశ్వాసాలకతీతంగా ప్రకృతి వ్యవసాయం పట్ల నిబద్ధతతో రాస్తూ అందుకు కొన్ని సూచనలు చేశారు. మరికొందరు ఆచరణాత్మక ప్రకృతి వ్యవసాయ పద్ధతులను, బతుకమ్మ పిండి వంటలను తయారుచేసే విధానాలను కూడా రాశారు. మనముందున్న అంశం కేవలం 9 రోజుల 'ప్రచార క్యాంపెయిన్'తో ముగిసేది కాదు. ఇది ఏడాది పొడవునా దీర్ఘకాలం పాటు సాగే ఉద్యమ కార్యక్రమం. కావున రచయితల వ్యాసాలన్ని యధాతథంగా ప్రచురించాము. ఈ నిరంతర ఉద్యమం ఏకాభిప్రాయం గల వాళ్లందర్ని నిర్ణీత అంశం మేరకైనా ఐక్యం చేయగలిగితేనే ఒక అడుగు ముందుకు వేయగలం.