Prakriti-Paryaavaranam

Editor · Education & Science

Prakriti-Paryaavaranam book cover

Price: Rs. 95. తెలుగు సమాజంలో ఈ ఇరవైయ్యొకటో శతాబ్దంలో కూడా శాస్త్రీయ దృక్పథం సమగ్రంగా, సవ్యంగా వ్యక్తం కావడం లేదు. ప్రకృతి పట్ల, సమాజం పట్ల, మనిషి పట్ల ఉండవలసిన హేతుబద్ధ, భౌతికవాద, శాస్త్రీయ ఆలోచనలు చాలామందిలో ఉండడం లేదు. ప్రాథమికస్థాయి నుంచే శాస్త్ర విజ్ఞాన పాఠ్యాంశాలు ఉంటున్నప్పటికీ చదువుకున్నవారిలో కూడా శాస్త్రీయ భావాలు అలవడవలసినంతగా అలవడడం లేదు. ఈ స్థితిలో సమాజంలో శాస్త్రీయ భావాలు వ్యాప్తి చెందాలంటే ప్రకృతి రహస్యాలను గురించి, సమాజ పరిణామం గురించి రోజురోజుకూ విస్తరిస్తున్న సమాచార సంపదను సూటిగా, సరళంగా వివరించే పుస్తకాలు కావాలి. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకే ఈ 'అందరిదీ విజ్ఞానం' పుస్తకమాలిక. ఈ పుస్తకం ప్రకృతిలో నైసర్గిక జంతుదశ నుంచి రెండు కాళ్ల మీద లేచి నిలిచిన మనిషి లక్షల సంవత్సరాలుగా సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణాన్ని వివరిస్తుంది. వానరుడి నుంచి నరుడిగా మారిన పరిణామక్రమం అని సాధారణంగా చెప్పుకునే వివరణవెనుక ఎంత సంక్లిష్టమైన చరిత్ర ఉందో, అడుగడుగునా పడుతూ లేస్తూ అంతకంతకూ పురోగమిస్తూ ఆదిమ మానవులు ఆధునిక సమాజంగా ఎలా ఎదిగారో ఈ పుస్తకం వివరిస్తుంది. కేవలం జంతువునుంచి మనిషి పరిణామాన్ని మాత్రమే కాక మానవసమాజం కూడా ఏయే దశలు గడుస్తూ ఇవాల్టి స్థితికి చేరిందో ఈ పుస్తకం సులభంగా, సరళంగా వివరిస్తుంది. 2012) కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949 అణుభౌతికశాస్త్రంలో డాక్టరేట్ చేసి ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రంలో అణుధార్మిక శాస్త్రవేత్తగా పనిచేశారు... వెలువడిన రచనలు: 'జీవశాస్త్ర విజ్ఞానం-సమాజం' (2008), 'విశ్వాంతరాళం' (2009), ' ' (2010), ' -నాడీ కణాలు' (2010), 'ప్రకృతి- పర్యావరణం' (2011), 'మనుషులు చేసిన దేవుళ్లు' (2011), 'జీవశాస్త్ర విజ్ఞానం సమాజం' (2012), 'అణువుల శక్తి' (2012).

Browse more Telugu books