Prajala Manishi
Editor · Novels

Price: Rs. 139. తెలంగాణ తొలి నవలాకారుడు అళ్వార్ స్వామి. తెలంగాణ తొలి నవల ప్రజల మనిషి. *** 'ప్రజల మనిషి' 1938కి పూర్వపు ప్రజాజీవితం అని అళ్వార్న్వమి చెప్పుకున్నారు. ఆ సంవత్సరం హైద్రాబాదు స్టేట్ కాంగ్రెసు స్థాపించే ప్రయత్నం జరిగింది. ఇంకా పుట్టకముందే నిజాం ప్రభుత్వం కాంగ్రెసును నిషేధించింది. ప్రజల మనిషి ప్రచురణ 1955. రచనాకాలం 1952-55 అవుతుంది! 1948లో పోలీసుచర్య తరువాత తెలుగుదనం పెల్లుబికింది! *** ప్రజల మనిషి కథ అతి పల్చని పొర! ఉద్యమం కోసం అల్లిన చిన్న కథ. ఇది ఉద్యమ నవల మాత్రమే కాదు సాంఘిక చరిత్ర! నాటి అమలిన జీవితాన్నీ, ప్రేమలు, ఆప్యాయతలు, వేదనలను అతిసున్నితంగా, ఆర్ద్రంగా చిత్రించారు! ఇది నెత్తుటి మరక లేని నవల! ఆళ్వార్స్వామి అహింసా కమ్యూనిస్టు! ఈ నవలలో సంభాషణలు తక్కువ. ఉపన్యాసాలు ఎక్కువ. ప్రేమ్చంద్ పాత్రలు ఉపన్యసిస్తాయి! అది మరింత చెప్పాలనే ఆతురత! - -డా|| దాశరథి రంగాచార్య