Prajala Gonthuka

Editor · Politics

Prajala Gonthuka book cover

Price: Rs. 135. అరుణారుణ పథంలో పయనిస్తున్న దీర్ఘకాల సహచరుడు జూలకంటి రంగారెడ్డి. ప్రజా ఉద్యమాలనేతగా సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకుడుగా అందరికీ చిరపరిచితుడు. 1994లో యువ నాయకుడుగా ఆయన తొలిసారి మిర్యాలగూడ నుంచి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం జ్యోతిబాసు పాల్గొన్న ప్రచారసభలో తనపట్ల ప్రజల ప్రేమాభిమానాలు ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు ఘన విజయం సాధించిన జూలకంటి 1999 మినహా మరో రెండుసార్లు వరుసగా శాసనసభకు నెగ్గారు. చారిత్రాత్మకమైన విభజన నిర్ణయం జరిగినప్పుడు కూడా సభలో వున్నారు. గత మూడునాలుగు దశాబ్దాలుగా ఆయనను ప్రత్యక్షంగా గమనిస్తున్న వారికి తన నిబద్దత, రాజకీయ స్పష్టత, పోరాటశీలత ఎంతో గౌరవ భావన కలిగిస్తాయి. ఆరోపణలు వివాదాలకు దూరంగా ప్రజలతో మమేకం కావడం తనను తీర్చిదిద్దిన ఉద్యమం నిద్ధాంతం గీటు తప్పకపోవడం రంగన్న ప్రత్యేకతలు. భీమిరెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, నర్రా రాఘవరెడ్డి వంటివారితో కలసి పనిచేస్తూ 'వారి అనుభవాలు ఆకళింపు చేసుకున్న నాయకుడు. అందరితో కలసిమెలసి వ్యవహరించే స్నేహశీలి.

Browse more Telugu books