Prajageyalu
Editor · Best Selling

Price: Rs. 110. మా అమ్మమ్మ, మా అమ్మ, మా అక్క (రాములమ్మ, పోశమ్మ, జంగమ్మ) పాటలు పాడేవారు. ప్రత్యేకించి మా అక్క జంగమ్మకు అన్ని రకాల కళారూపాలతో పరిచయం వుండేది. మా అమ్మమ్మగారి ఊరైన శేరిగూడలో మరొక దళిత మహిళ కంబాలపల్లి జంగమ్మ మా అమ్మకు దోస్తురాలు. శారదగాండ్ర కథను బాగా చెప్పేది. వారు కథ చెబుతుంటే శ్రద్ధగా వినేవాణ్ణి. అంబేద్కర్ జయంతికి వెళ్లి గద్దరన్న రాసిన ఒక పుస్తకం కొన్నాను. ఆ పుస్తకం చదివినంక నాకు పాట రాయగలను అనే ధైర్యం వచ్చింది.. -బండి సత్తెన్న ఈ పుస్తకంలోని ప్రతి పేజీ ఒక జీవిత సారంగి, ఓ జీవన గానంగా వర్ధిల్లింది. ఎక్కడ ప్రజానాట్యమండలి ప్రదర్శన ఉన్నా అక్కడ సింహభాగం సత్తెన్న పాటలు ఉండి తీరతాయి. దళిత ఆత్మగౌరవ పోరాటంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, ఆర్.టి.సి. కార్యక్రమ సమస్యలపై, బాలకార్మిక, వెట్టి వ్యతిరేక ఉద్యమాలలో, వృత్తిదారులు, రైతు, వ్యవసాయ కార్మిక జీవితాలు, విద్యుత్ ఉద్యమం, మహిళా సాధికారత ఇలా ఎన్నో ఇతివృత్తాలను సజీవంగా ఆవిష్కరించిన అపరబ్రహ్మ మన సత్తెన్న. -దేవేంద్ర పాటయి ఆటయి ప్రజల ఆశల బాటయి రేపటి వేకువ దోసిలిపట్టే మందారపు తోటై పరిమళించే రాగం సత్తెన్న, అద్భుతమైన గాత్రంతో తాతల తండ్రుల నుంచి ఒడిసి పట్టుకున్న విలక్షణ బాణీలతో అశేష ప్రజలకు చేరువైన సత్తెన్న పాటలో ఏ పాటకదే ప్రత్యేకం. ఇంతకుముందున్న కవుల స్పూర్తి వారసత్వం నుంచి తానొచ్చినా తన పాటల్లో సొంత గొంతుకతో పలుకుతున్నవాడు సత్తెన్న. -గోరటి వెంకన్న దళిత, బహుజనులు ఏకమై పోరుబాటన నడవాలంటాడు. సత్తెన్న. అలా దళితులు కిందికులాల బతుకులు హాయిగా ఉండాలని తనొక కలగంటున్నాడు. ఆ కల నిజం కావడానికి నిరంతరం తన కలంతో ఉద్యమాలకు, పోరాటాలకు మద్దతునిస్తూ ముందుకు సాగుతున్నాడు. -డాక్టర్ పసునూరి రవీందర్