Praja Thanthra Viplavam lo Social Democracy Rendu Etthugadalu

Editor · Politics

Praja Thanthra Viplavam lo Social Democracy Rendu Etthugadalu book cover

Price: Rs. 135. ఈ గ్రంధంలో లెనిన్ వివరించిన నిర్మాణ సూత్రాలు ప్రపంచంలోని ఏ విప్లవపార్టీకైనా మార్గదర్శకంగా, అనుసరణీయంగా ఉంటాయి. ప్రతీ పార్టీ సభ్యుడూ నిబంధనావళికి, క్రమశిక్షణకు కట్టుబడి వ్యవహరించడం. కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని అన్ని స్థాయిలలోనూ అమలు చేసి ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని పాటించడం, పార్టీ సభ్యుల, సాధారణ కార్మికుల స్వతంత్ర కార్యాచరణను ప్రోత్సహించడం, విమర్శ- ఆత్మవిమర్శ పద్ధతిని అనుసరించడం ఈ మౌలిక సూత్రాల ప్రాధాన్యతను రష్యన్ నిర్దిష్ట పరిస్థితుల నేపధ్యంలో వివరించడం జరిగింది. నిర్మాణ సమస్యలు సిద్ధాంతంతో, రాజకీయ విధానంతో నిమిత్తం లేకుండా విడిగా ఉంటాయని భావించేధోరణి ఎంత తప్పో, నిర్మాణ విషయాల్లో సూత్రబద్ధ వైఖరిని అనుసరించకుండా సూత్ర విరుద్ధంగాను, అవకాశవాదంగాను వ్యవహరిస్తేమ విప్లవోద్యమానికి ఎంత హాని జరుగుతుందో ఈ పుస్తకం వివరిస్తుంది. అందుకే ప్రతీ కమ్యూనిస్టూ ఈ గ్రంధాన్ని అధ్యయనం చేయాలి. ఈ గ్రంధం ముగింపులో లెనిన్ రాసిన వాక్యాలు పార్టీ నిర్మాణం ప్రాధాన్యత శక్తివంతంగా వివరిస్తాయి. “అధికారం కోసం జరిగే పోరాటంలో 'నిర్మాణం' తప్ప శ్రామికవర్గానికి మరో ఆయుధం ఏదీ లేదు. అరాచకపు పోటీ ఎల్లెడలా నెలకొనివుండడమే బూర్జువాపాలన స్వభావం. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే వారు కార్మికులను బలవంతపు శ్రమలోకి నెడతారు. దాని పర్యవసానంగా కార్మికులు దుర్భరదారిద్య్ర్యం, ఆటవిక పని పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అంతకంతకూ వారు అగాథంలోకి దిగజారిపోతారు. ఐతే ఈ పరిస్థితుల్లోనే ఆ శ్రామికవర్గం మార్క్సిస్టు సిద్ధాంతం ప్రాతిపదికన అనివార్యంగా ఐక్యం అవుతారు. సంస్థాగత నిర్మాణం బలోపేతం చేసి అమిత శక్తివంతులౌతారు. ఆ క్రమంలో కోట్లాది శ్రమజీవులు ఒక బ్రహ్మాండమైన శ్రామికవర్గ సైన్యంగా రూపొందుతారు. ఈ సైన్యం ధాటికి వయస్సు మళ్ళిన రష్యన్ నిరంకుశ అధికారం గాని, కాటికి కాళ్ళు జాపుకుని వున్న అంతర్జాతీయ పెట్టుబడి గాని నిలబడజాలవు.”

Browse more Telugu books