Praja Kalakarulu ela Undali
Editor · Politics

Price: Rs. 81. స్ఫూర్తి రచనలన్నీ ప్రజల కోసం చేసినవే. ఉద్యమాల నుద్దేశించినవే. సామాజిక మార్పుకు, న్యాయానికి అంకితమయినవే. ఈ రచన స్ఫూర్తి కూడా అదే అయినా, విషయం ఉద్యమ నిర్మాణానికి, ఉద్యమ లక్ష్యాలకు సంబంధించినది. కళా, సాంస్కృతిక ఉద్యమకారులనుద్దేశించినది. -బి.వి రాఘవులు కళాసైనికులుగా పనిచేసే ప్రజాకళాకారులు తమను తాము కళాకారులుగా తీర్చిదిద్దుకోవడానికి, ప్రజా కళాకారులు పాటించే నియమాలను స్ఫూర్తి ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి ప్రజా కళాకారుడు చదవాల్సిన పుస్తకం. మంచి రచనను అందించిన స్ఫూర్తిని అభినందిస్తున్నాను. -కందిమళ్ల ప్రతాపరెడ్డి 'స్ఫూర్తి' ప్రాథమికంగా కవి, గాయకుడు, ప్రజానాట్యమండలి బాధ్యుడు, చేస్తున్న ఉద్యోగం అవకాశం ఇచ్చినప్పుడల్లా వివిధ ప్రాంతాలలో పర్యటించాడు. క్షేత్రస్థాయి సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడానికి గత దశాబ్దంలో పలుమార్లు దళాలతో పాటు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ సమయంలో తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను పూసగుచ్చి ఒక పుస్తకంగా మనముందు ఉంచుతున్నాడు. ఈ గ్రంథంలో ప్రజా సాంస్కృతిక రంగం ఎదుర్కొనే కొన్ని విషయాలను లోతుగా చర్చకు పెట్టాడు. -జయధీర్ తిరుమలరావు మనం ప్రజా కళాకారులం, అందులో కష్టజీవుల, సెమట సుక్కల మెరుపును, ఎరుపును, సెమట సుక్కల సెంటు వాసనని, తిరుగుబాటును, విప్లవాన్ని కళా రూపాల్లో చిత్రించాలి.... అప్పుడు మన కళ... కళ మాత్రమే కాదు, అది ఒక భౌతిక శక్తి, విప్లవ శక్తిగా మారి చలనంలో ఉంటుంది. అలా విప్లవశక్తిగా మార్చే అవకాశాలను... ఆచరించే క్రమాన్ని ఎంతో బాధ్యతగా తెలియచెప్పిన 'స్ఫూర్తి'ని అభినందిస్తున్నాను. - గద్దర్ తెలుగునాట ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, ఆంధ్ర ప్రజానాట్యమండలి, జననాట్యమండలి, ప్రజా కళామండలి, బహురూపుల కళా మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య లాంటి అనేక సాంస్కృతిక సంఘాలు ప్రజా జీవితంపై అశేష ప్రభావాన్ని చూయించి, కొన్ని వేల కళా సైన్యాన్ని సృష్టించుకున్నా, ఆచరణకు సంబంధించిన పుస్తకం లేకపోవడం లోటుగా భావించి కొన్ని సాధారణ అంశాలను ప్రత్యేకంగా కళాకారులకు సంబంధించి రాయాలని నిర్ణయించుకున్నాను. -