Prachina Bharathadesha Charitra

కె. బాలగోపాల్ / K.Balagopal · History

Prachina Bharathadesha Charitra book cover

Price: Rs. 180. శాస్త్రీయ దృక్పథంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి.డి. కోశాంబిని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఆలోచనాపరుడు, ప్రగతిశీల మేధావి కె. బాలగోపాల్ రాసిన, మూడు దశాబ్దాలుగా ఎన్నో పునర్ముద్రణలు పొందుతున్న విలువైన పుస్తకం ఇది. మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథం గల వారందరూ దామోదర్ ధర్మానంద్ కోశాంబి (1907-1966) ని ఆద్యునిగా భావిస్తారు. చరిత్ర పరిశోధనా పద్ధతిలోనూ, సిద్ధాంత దృక్పథంలోనూ, శాస్త్రీయ ప్రమాణాలను నెలకొల్పిన వ్యక్తిగానే గాక వలసతత్వం, శృతిమించిన 'దేశభక్తి', సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్పరత మొదలైన అనేక అవలక్షణాల నుండి మన దేశ చరిత్రను రక్షించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు. ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి (ఆదిమకాలం నుండి భూస్వామ్య దశ వరకు) కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం ఈ పుస్తకం. శాస్త్రీయంగా ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదల్చుకున్న ఎవ్వరైనా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదు. కె.బాలగోపాల్ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త.

Browse more Telugu books