Pracheenandhra Desa Charitra - Grameena Jeevanam
Kakani Chakrapani / కాకాని చక్రపాణి · History

Price: Rs. 112. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి (1921-) బెనారస్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులు (1948), ధార్వాడ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్.డి. (1976), అధ్యాపకుడిగా 1951 నుండి 1959 వరకు , 1959 నుండి 1977 వరకు ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి 1977లో డిప్యూటీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. పి.వి.పి. శాస్త్రిగారు ప్రసిద్ధ శాసన పరిశోధకులు, చరిత్ర పరిశోధకులు. వందలాది శాసనాలను ప్రకటించారు. వందకు పైగా పరిశోధనపత్రాలు ప్రచురించారు. కాకతీయులు, శాతవాహన ఎపోక్-ఎ న్యూలైట్, రూరల్ స్టడీస్ ఇన్ ఎర్లీ ఆంధ్రా, శ్రీశైల చరిత్ర-సంస్కృతి వీరి ముఖ్య రచనలు. తెలుగు విజ్ఞాన సర్వస్వం - చరిత్ర, సంస్కృతి 1-2 సంపుటాలకు సహాయ సంపాదకత్వం వహించారు. చరిత్రకారులుగా బహుపురస్కారాలు పొందారు. బయ్యారం చెరువు శాసనం ఆధారంగా కాకతీయ వంశానుక్రమణిక, కోటిలింగాల తవ్వకాలు ఆధారంగా శాతవాహన వంశ కాలనిర్ణయమూ, వారికి పూర్వ ఆంధ్రరాజుల విశేషాలు శాస్త్రిగారు వెలికితెచ్చిన చారిత్రకాంశాలు. పురాతత్త్వ పరిశోధకులుగా శాస్త్రిగారు అనేక నూతనాంశాలను వెలుగులోకి తెచ్చారు. ప్రాచీనాంధ్ర దేశ గ్రామీణ జీవిత చరిత్ర ఈ గ్రంథం.