Pracheena India lo Viplavam Prathi Viplavam-III Prathi Viplavam: Varna Vairudhyalu, Shudrulu, Sreelu Series 7

Editor · History

Pracheena India lo Viplavam Prathi Viplavam-III Prathi Viplavam: Varna Vairudhyalu, Shudrulu, Sreelu Series 7 book cover

Price: Rs. 180. బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ 'ప్రాచీన ఇండియాలో విప్లవం-ప్రతి విప్లవం’ ఈ పుస్తకం రాయడానికి అనేక గ్రంథాలను పరిశీలించారు. భారతీయ శాస్త్రం (ఇండాలజి) పరిశోధనను అత్యంత ఉన్నత స్థాయిలో పరిశీలించి ప్రతిపాదించి నటువంటి గ్రంథం. 1956 మార్చి 15వ తేదిన 'బుద్ధుడు బౌద్ధ ధమ్మం' అనే తన చారిత్రక గ్రంథం ముందుమాటలో 'బుద్దిజంను సవ్యంగా అర్థం చేసుకునేందుకు వరుస మూడు పుస్తకాలలో ఇదొకటిని రాశారు. మిగతా రెండు 'బుద్ధుడు-కారల్ మార్క్స్', 'ప్రాచీన ఇండియాలో విప్లవం ప్రతి విప్లవం' అనే వాటిని విడిగా రాశాను. వాటిని త్వరలోనే ప్రచురించగలనని ఆశిస్తున్నాను అని అన్నారు. బాబాసాహెబ్ బహు గ్రంథాల అధ్యయన శీలి, మేథా సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు శాస్త్రాలపై తన కలం నుండి అనేక గ్రంథాలు రచించారు. తాను జీవించిన కాలంలోనే కొన్ని పుస్తకాల ప్రచురణ జరిగింది. మరికొన్ని ప్రచురణకు సిద్ధం చేశారు. మరెన్నో పుస్తకాల రచన కొరకు చిత్తు ప్రతులను సిద్ధం చేసుకున్నారు. అందులోని పుస్తకమే ఈ పుస్తకం. తను కనుగొన్న విషయాలను ద్రువపరిచేందుకు అనేక ప్రాచీన భారతీయ శాస్త్ర గ్రంథాల నుంచి ప్రస్తావించడంలో ఆయన పాండిత్య ప్రతిభ కనిపిస్తుంది. బాబాసాహెబ్ లాంటి మేథో సంపత్తిగల మరో వ్యక్తిని భారతదేశంలో కనుగొనడం కష్టసాధ్యమౌతుంది.

Browse more Telugu books