Prachara Sadhanaluga Janapadha Geyalu

Editor · New Arrivals

Prachara Sadhanaluga Janapadha Geyalu book cover

Price: Rs. 270. స్వతహాగా బోనాల ప్రకాశ్ కవి, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు. అష్టకష్టాలు పడి ఉన్నత విద్యలే అభ్యసించాడు. జానపదం అతని ఊపిరి. పాటరాసినా, పాడిన జానపద సుగంధాలే. పల్లవులు, బాణీలు అన్నీ. యం.ఏ. జానపద కళలు సబ్జెక్టులో చేశాడు, యం.ఫిల్ పరిశోధన “బైండ్ల కథ" అదికూడా జానపద కళారూపమే. ఈ పరిశోధన కూడా “ప్రచార సాధనాలుగా జానపద గేయాలు" అంశంపైనే చేశాడు. రొటీన్ అంశాలపై కాకుండా అసలు సిసలు జానపద పాట, గేయం, బాణీలు వివిధ కాలాలలో, వివిధ అవసరాల మేరకు జానపదాలను మార్చి వాడుకున్న ఒక విధానాన్ని ఫోకస్ చేస్తూ, పరిశోధించాడు. మత ప్రచారానికి, దైవ ప్రచారానికి కూడా ఈ గేయాలే ప్రాణాధారాలు. కీర్తనలు, తత్వాలు, దరువులు వంటి దేశీయ ప్రక్రియలను చాలా మంది ఉపయోగించు కున్నారు. అంటే జానపదగేయం పుట్టిన వాతావరణం, ఉత్పత్తి, శ్రమజీవనం, శారీరక కష్టం, విరామం, వినోదం వంటి సందర్భం జానపద గానానికి మూలం. వీటిని పరిహరించి అనగా పరాయికరించి తమ అవసరాల కోసం కొత్త ఇతివృత్తాన్నిజోడించి రాసుకున్న లేదా పాడుకున్న సాహిత్యం కూడా జానపదమే అవుతుందని భావిస్తారు. కాకపోతే ఈ సాహిత్యం కూడా మౌఖికమే. కొంత వరకు సామూహికమే. ఐతే ఈ పాటలకు కవిపేరు, గాయకుని పేరు జోడించబడుతుంది కాని జానపద సాహిత్యంలో ఈ రెండు అంశాలకు స్థానంలేదు, కనిపించవు, దీనిని “సామూహిక గానం"గా పేర్కొంటారు. అందుకే దీనిని "అజ్ఞాత కర్తృత్వం” అని కూడా అంటారు.

Browse more Telugu books