Prachaara Saadhanaaluga Jaanapada Geyalu
డా. బోనాల ప్రకాష్ / Dr. Bonala Prakash · Literature

Price: Rs. 270. స్వతహాగా బోనాల ప్రకాశ్ కవి, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు. అష్టకష్టాలు పడి ఉన్నత విద్యలే అభ్యసించాడు. జానపదం అతని ఊపిరి, పాటరాసినా, పాడిన జానపద సుగంధాలే. పల్లవులు, బాణీలు అన్నీ, యం.ఏ. జానపద కళలు సబ్జెక్టులో చేశాడు, యం. ఫిల్ పరిశోధన “బైండ్ల కథ" అదికూడా జానపద కళారూపమే. ఈ పరిశోధన కూడా "ప్రచార సాధనాలుగా జానపద గేయాలు" అంశంపైనే చేశాడు. రొటీన్ అంశాలపై కాకుండా అసలు సిసలు జానపద పాట, గేయం, బాణీలు వివిధ కాలాలలో, వివిధ అవసరాల మేరకు జానపదాలను మార్చి వాడుకున్న ఒక విధానాన్ని ఫోకస్ చేస్తూ, పరిశోధించాడు.