Pottupoyyi

Editor · Stories & Poetry

Pottupoyyi book cover

Price: Rs. 145. రైతన్నలు, నేతన్నలు వంటి ఇతర వృత్తుల వారినీ, కుల వృత్తుల వారినీ, వారి ఈతి బాధల్నీ కవులు చాలా కాలంగా కావ్యబద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ, జాలర్లు, చాకళ్లు వంటివారు చాలా అరుదుగానే కవిత్వీకరించబడుతున్నారు. ఈ సంకలనం ఆ లోటును కొంత భర్తీ చేయడం అభినందనీయం. ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయ వ్యవస్థ పాలనా వ్యవస్థల తీరు తెన్నులు కూడా ఈ సంకలనంలో చిత్రించబడ్డాయి. ఎన్నికల తంతులూ, రైతు రుణమాఫీ వంటి పాలకుల వాగ్దానాలు, రాజధాని పేరుతో రైతుల భూములచుట్టూ తిరిగిన రాజకీయాలు, ప్రాజెక్టులూ, ప్రణాళికలు వంటి ఇతరేతర అంశాలు వ్యాపార వర్గాలకు అనుగుణంగా ఎలా మలచబడ్డాయో ఎలుగెత్తి చెప్పిన కవుల గొంతులను ఈ సంకలనంలో వినవచ్చు.

Browse more Telugu books