Poratala Potthali

Editor · Biographies & Auto Biographies

Poratala Potthali book cover

Price: Rs. 75. పుట్టిన బిడ్డా కనులు తెరిచి తన అమ్మను జూసెను ప్రతిబిడ్డా తన ఆఖరి శ్వాసలో అమ్మను తలచేను అమ్మా నిన్ను తాకినచోట అన్నీ కన్నీల్లే... అవి సమత మమతలై పొంగిన నాడు గంగిగోవు పాలే గంగిగోవు పాలే...... మముగన్న మాతల్లి మల్లమ్మ నీమనసంత ఎన్నెల సలువమ్మా ఎండలో మాగిన నల్లమ్మా-నీ కండలు కరిగెనే కూలమ్మా గాయిది పనులెన్నో జేస్తివి - నువ్వు గంధమయ్యి కరిగిపోతివి బాపనిండ్లు తెల్లారినా - నీ బాంచే బతుకు సల్లారెనా కొడుకుల బిడ్డల నవ్వులే నీకు కోట్లాది రతనాల రవ్వలే ఈపుకు ఉయ్యాల గడ్డివా - పని పాటలే జోలగ పాడితివా నాట్లల్లో కలుపుల్లో నాయిక నువు కోతల్లో మోతల్లో ధీటిక దంచంగ ధాన్యము దంగేనా నువ్వు ఇసురంగ రెక్కలు ఇరిగేనా తడ్సి ముద్దయితివ చెమటలో అయ్యో తడి ఆరిపోయిన గొంతులో కూలి కొంగున శారెడు నూకలే ఉడికి పొంగిన ఆశలు మేమెలే

Browse more Telugu books